Begin typing your search above and press return to search.

'ఇప్పటికైనా మారాలి' అంటున్న స్టార్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 April 2020 4:04 PM GMT
ఇప్పటికైనా మారాలి అంటున్న స్టార్ బ్యూటీ
X
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సాహో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. నటిగా విపరీతమైన క్రేజ్ ఉన్న శ్రద్ధకు పెంపుడు జంతువులు అంటే ప్రాణమట. తను పెంచుకునే కుక్క బాగోగుల గురించి ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులే కాదు జంతువులు కూడా ఆకలితో అలమటిస్తుంటే.. వాటి ఆకలి తీర్చేందుకు స్వచ్చంధ సంస్థకు విరాళం అందించిందట అమ్మడు. మూగ జీవుల ఆకలి తీర్చెందుకు వీలైతే మీరు కూడా చేయాలని కోరుతోంది. ఈ క్రమంలోనే మనుషుల తీరు గురించి మాట్లాడింది శ్రద్ధ. కొన్ని రోజులు లాక్ డౌన్ చేసి ఇంట్లో ఉండమంటే విలవిలలాడిపోతున్నారు.

ఒంటరి తనం - ఒత్తిడి - మానసిక సమస్యలతో భయపడిపోతున్నారు. మరి జంతువులవి కూడా మనుషుల్లాంటి ప్రాణాలే కాదా ? అని ప్రశ్నిస్తోంది. మిలియన్ సంఖ్యలో జంతువులు తమ జీవితం మొత్తం బంధించబడి ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి లోనై వాటికి అవే బాధించుకుంటున్నాయి అని వాపోయింది. ఇప్పటికైనా మారండి… మనం ఈ భూమి మీదకి కేవలం అతిథులుగా వచ్చాం అని.. మిగతా జంతువులు కూడా మనలాగే వచ్చాయని తెలిపింది. అలాంటపుడు ప్రకృతిని నాశనం చేయడం - తోటి ప్రాణులను హింసించే హక్కు మనకు లేదని అర్ధం చేసుకోవాలంది. ఈ అమ్మడి సందేశము ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.