Begin typing your search above and press return to search.

అయ్యో..బయోపిక్ లో నుంచి తీసేశారా?

By:  Tupaki Desk   |   8 Jan 2018 11:58 AM GMT
అయ్యో..బయోపిక్ లో నుంచి తీసేశారా?
X
ప్రస్తుత రోజుల్లో బయోపిక్ సినిమాలు ఏ స్థాయిలో తెరకెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవ్వరైనా సరే బయోపిక్ లో నటిస్తారా అని అడిగితే ఏ మాత్రం అభ్యంతరాలు చెప్పడం లేదు. ముఖ్యంగా క్రీడలకు సంబందించిన ప్లేయర్స్ జీవితాలలో గెలుపోటములను తెరపై ఎంతో ఆసక్తికరంగా చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... రీసెంట్ గా ఒక బయోపిక్ నుంచి శ్రద్దా కపూర్ ను తీసేశారట.

బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత ఆధారంగా అమోలే గుప్తే తెరకెక్కిస్తోన్న ఆ బయోపిక్ లో శ్రద్ధ కపూర్ ని సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రద్ధ ఎంతో శ్రద్దగా బ్యాడ్మింటన్ ను నేర్చుకుంటోంది. హైదరాబాద్ లో సైనాతో ఎక్కువగా ఉంటోంది. కానీ రీసెంట్ గా ఆమెను తొలగించారని చాలా రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో తేడాలు వస్తుండడంతో శ్రద్ధ మార్కెట్ అడ్డు పడుతోందని అనుకున్నారట. ఆమెకంటే ఎక్కువ స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీపికా పదుకొనె అయితే బెటర్ అని నిర్మాతలు ఆమెకు రెమ్యునరేషన్ ని కొంచెం ఎక్కువగా ఇచ్చి ఒప్పించాలని అనుకుంటున్నారట. దీంతో శ్రద్దా ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు తన చేతిలో ఉన్న బంగారం లాంటి బయోపిక్ ఇలా చేజారిపోయిందేంటని బాధపడుతోందట. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రభాస్ - సాహో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తప్ప శ్రద్ధ కి పెద్దగా అవకాశాలు లేవు. మరి ప్రభాస్ వల్ల లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందో లేదో చూడాలి.