Begin typing your search above and press return to search.

సాహో భామ కోసం వెయిటింగ్!

By:  Tupaki Desk   |   2 Aug 2018 10:30 PM GMT
సాహో భామ కోసం వెయిటింగ్!
X
టాలీవుడ్ ఎంట్రీని ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో అందులోనూ సాహూ లాంటి భారీ బడ్జెట్ మూవీతో చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ తన ప్రతి సినిమా విషయం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. గతంలో దావూద్ ఇబ్రహీం చెల్లెలు హసీనా పార్కర్ బయోపిక్ చేసినప్పుడు బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం నేరుగా మాఫియా వాళ్ళను కలిసే ప్రయత్నం కూడా చేసింది. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం టైటిల్ రోల్ చేసేందుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన శ్రద్ధ కపూర్ దాన్ని సెట్స్ పైకి వెళ్లేలా జరుగుతున్న ఆలస్యంలో తనే ప్రధాన కారణంగా మారుతోంది. సైనా నెహ్వాల్ ఇది తన కథ కాబట్టి తెరకెక్కే విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారట. ఆట ఆడటం మొదలుకుని తన శరీర కదలికల దాకా ప్రతిదీ దగ్గరుండి చూసుకుని శ్రద్ధ కపూర్ అంచనాలకు తగ్గట్టు చేస్తోంది అన్న నమ్మకం వచ్చినప్పుడే షూటింగ్ కు వెళ్లాలని దర్శకుడు అమోల్ గుప్తా  కు చెప్పడంతో ఇది ముందుకు సాగడం లేదని టాక్.

ప్రాజెక్ట్ డ్రాప్ కాలేదు కానీ కొంత లేట్ అవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో సాహో షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడే పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంది శ్రద్ధ. అది ఇంకా సరిపోయినట్టు లేదు. శ్రద్ధ కొత్త హిందీ సినిమా స్త్రీ ఈ నెల 31న విడుదల కానుంది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ హారర్ కామెడీ మూవీలో శ్రద్ధ దెయ్యం పాత్రలో నటించినట్టు బాలీవుడ్ టాక్. టైలర్ గా ఉండే హీరోను వెంటాడే పాత్రలో శ్రద్ధ కపూర్  చాలా వెరైటీగా కనిపిస్తుందట. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉంన్నాయి. బత్తీ గుల్ మీటర్ చాలుతో పాటు నవాబ్ జాదే షూటింగ్ లో ఉన్నాయి. సాహో సక్సెస్ అయితే టాలీవుడ్ నుంచి ఛాన్సులు క్యూ కడతాయని ప్రత్యేకంగా చెప్పాలా. కాకపోతే వచ్చే సమ్మర్ దాకా వేచి చూడక తప్పదు. సాహో అప్పటి దాకా వచ్చే అవకాశం కనిపించడం లేదు.