Begin typing your search above and press return to search.
'సాహో' ఆఫర్ కి ఎగిరి గంతేసిందట!
By: Tupaki Desk | 11 Aug 2019 7:50 PM ISTప్రభాస్ కథానాయకుడిగా నటించిన `సాహో` అన్ని పనులు పూర్తి చేసుకుని ఈనెల 30న రిలీజవుతోంది. సరిగ్గా రెండేళ్లు పట్టింది పూర్తి చేసి థియేటర్లలో వదిలేందుకు. 2017 ఏప్రిల్ లో బాహుబలి 2 రిలీజైంది. ఇన్నాళ్ల తర్వాత డార్లింగ్ అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఆ ఎగ్జయిట్ మెంట్ అతడిలో స్పష్ఠంగా కనిపిస్తోంది. సాహో రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరిలానే.
అయితే ఈ సినిమా కథానాయిక శ్రద్ధా కపూర్ లో ఎగ్జయిట్ మెంట్ చూస్తుంటే అసలే ఆపలేని సన్నివేశం కనిపిస్తోంది. సాహో చిత్రానికి శ్రద్ధా సంతకం చేస్తుందా చెయ్యదా? అంటూ ఆరంభం రకరకాలుగా మాట్లాడుకున్నారు. శ్రద్ధా కంటే ముందే చాలామంది బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే చివరికి శ్రద్ధానే ఆ ఆఫర్ వరించింది. అసలు ఇందులో తనకే అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటి? అంటే .. తను ప్రేమకథా చిత్రాల్లో నటించడమేనట. సాహోలో యాక్షన్ తో పాటు అద్భుతమైన ప్రేమకథ ఉంది. పైగా బాలీవుడ్ లో తనకు ప్రేమకథా చిత్రాల కథానాయికగా మంచి ట్రాక్ రికార్డ్ ఉందని.. ఆషిఖి 2 నుంచి తనని చూస్తున్నామని ప్రభాస్ అన్నారు.
అసలు సాహో ఆఫర్ రాగానే మీరెలా ఫీలయ్యారు? అని శ్రద్ధాని ప్రశ్నిస్తే.. ఆరోజు ఎగ్జయిట్ మెంట్ అణచుకోలేకపోయానని తెలిపారు. బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన అవకాశం అనగానే ఎగిరి గంతేసానని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమా కథ నచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ హీరో అనగానే ఎగ్జయిట్ అయ్యాను. ఇక ఇందులో నా రోల్ గొప్ప యాక్షన్ రోల్. పోలీసాఫీసర్. ఇంతకుముందు ఎన్నడూ చేయని యాక్షన్ పాత్రలో ఛాన్స్ వచ్చింది. పైగా హిందీతో పాటు అన్ని భాషల్లోనూ రిలీజవుతోంది. అందుకే అంగీకరించాను అని తెలిపారు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. అతడు అమేజింగ్ కోస్టార్.. ప్రేమ. జెన్యూనిటీ ఉన్న హీరో అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. మొత్తానికి శ్రద్ధా మబ్బుల్లో తేల్తోందని హైదరాబాద్ మీడియా మీట్ రివీల్ చేసింది.