Begin typing your search above and press return to search.

సాహోతో చేస్తున్నానహో!!

By:  Tupaki Desk   |   17 Aug 2017 4:01 PM GMT
సాహోతో చేస్తున్నానహో!!
X
ఒకప్పుడు టాలివుడ్ అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ బాహుబలి హిట్ తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాలపై ఓ కన్నేసి ఉంచుతోంది. ముఖ్యంగా అక్కడి మీడియాలు అయితే తెలుగులో వచ్చే కొన్ని సినిమాల గురించి ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేస్తున్నాయి. ఇక నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎప్పటికప్పుడు టాలీవుడ్ దర్శకులతో టచ్ లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా టాలీవుడ్ లో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోవద్దనే ఆలోచనలో ఉన్నారట.

గత కొన్ని రోజులుగా బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమాను తిస్తాడో అని ఎదురుచూసిన బాలీవుడ్ కి సాహో డైలాగ్ తో దిమ్మ తిరిగేలా చేశాడు ప్రభాస్. అయితే ఆ సినిమా హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలియడంతో తప్పకుండా బాలీవుడ్ కథనాయికనే ఎంచుకుంటారని అనుకున్నారు. అంతే కాకుండా ఎవరు ఆ అదృష్టవంతురాలు అని కూడా చర్చించుకున్నారు. దీంతో రీసెంట్ గా చిత్ర యూనిట్ శ్రద్ధా కపూర్ ని సెలెక్ట్ చేసిందని చెప్పడంతో బాలివుడ్ లో ఆ న్యూస్ ఒక్కసారిగా తెగ హల్ చల్ చేసింది.

ఇక శ్రద్ధా కపూర్ కూడా సాహో టీమ్ తో కలిసి పని చేయబోతున్నందుకు అలాగే ప్రభాస్ సరసన నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలుపుతూ ఆనంద పడుతోంది. ఆశిఖి 2 సినిమాతో చాలా పాపులర్ అయిన ఈ భామ తర్వాత బాలివుడ్ లో చాలా బిజీ అయిపోయింది. ఇప్పుడు మొదటిసారిగా ఓ సౌత్ స్టార్ తో జోడి కట్టనుంది. దాదాపు 150 కోట్లతో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహో చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.