Begin typing your search above and press return to search.
శ్రద్ధ అంత పెద్ద తప్పు చేసిందా!!
By: Tupaki Desk | 18 Nov 2016 11:27 AM ISTసినిమా తారలను వేధించడమే కాదు.. కంటి చూపుతోనే తినేసేలా వారు చాలామంది ఉంటారు. తారలపై అభిమానం శృతి మించిపోయిన సందర్భాలు కనిపిస్తూనే ఉంటాయి. రీసెంట్ గా తనను వేధించిన ఓ వ్యక్తిపై శృతి హాసన్ పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం కూడా చూశాం. అయితే.. శ్రద్ధా కపూర్ మాత్రం ఇలాంటి ఓ వ్యక్తికి గాట్టిగా హగ్ ఇచ్చేసింది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను గత కొంతకాలంగా ఓ వ్యక్తి ెవంటాడుతున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఇతగాడు ప్రత్యక్షం అయిపోతున్నాడట. అసలు తన షెడ్యూల్స్ ఇంత పక్కాగా తెలుసుకుని.. ప్రతీ చోటకు వచ్చేస్తుండడంపై శ్రద్ధ కూడా ఆశ్చర్యపోయిందట. పైగా తన ప్రవర్తనతో చికాకు పెట్టించే పనులు కూడా చేస్తున్నాడట. ఓ ఈవెంట్ జరుగుతున్నపడు.. తనను అంత పట్టిపట్టి తీక్షణంగా చూస్తున్న ఆ వ్యక్తిని స్టేజ్ పైకి పిలిచింది శ్రద్ధ. మీడియా సాక్షిగా గ్యారంటీగా క్లాస్ పీకేస్తుందని అంతా అనుకుంటే.. ఈమె మాత్రం ఎంచక్కా ఓ స్ట్రాంగ్ హగ్ ఇచ్చి పారేసింది.
అయితే.. శ్రద్ధ ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు చాలామంది. అమ్మాయిల వెంటబడి వేధించే వాళ్లను ప్రోత్సహించే చర్యగా అభివర్ణిస్తున్నారు. శ్రద్ధా కపూర్ లాంటి హీరోయిన్ ఇలా రియాక్ట్ అవడం కారణంగా.. సాధారణ ఆడపిల్లలను వెంటాడే వాళ్లు ఎక్కువైపోతారని హెచ్చరిస్తున్నారు పలువురు మానసిక నిపుణులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/