Begin typing your search above and press return to search.

'సాహో' తో దీపికను వెనక్కు నెట్టేసిన శ్రద్దా

By:  Tupaki Desk   |   3 Nov 2020 10:40 PM IST
సాహో తో దీపికను వెనక్కు నెట్టేసిన శ్రద్దా
X
బాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌.. మోస్ట్‌ క్రేజీ హీరోయిన్‌ ఎవరు అంటే ముందు వినిపించే పేర్లలో దీపిక పేరు ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్‌ పద్మావత్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి క్రేజ్‌ అందుకు నిదర్శణం. ఇండియాలో అత్యంత పాపులారిటీ కలిగిన సెల్రబెటీల జాబితాలో దీపిక టాప్‌ లో ఉంటుంది. అలాంటి దీపికను తాజాగా సాహో సినిమా వల్ల శ్రద్దా కపూర్‌ వెనక్కు నెట్టేసింది. ఇన్‌ స్టా గ్రామ్‌ లో అత్యధిక ఫాలోవర్స్‌ ను కలిగి ఉన్న సెలబ్రెటీగా విరాట్‌ కోహ్లీ నెం.1 గా ఉన్నాడు. 82.2 మిలియన్‌ ల ఫాలోవర్స్‌ తో ఎవరికి అందనంత ఎత్తులో కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ తర్వాత స్థానంను యూనివర్శిల్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా పొందింది. ఆమెకు ఇన్‌ స్టాలో 58.1 మిలియన్‌ ల ఫాలోవర్స్ ఉన్నారు.

మొన్నటి వరకు ప్రియాంక చోప్రా తర్వాత దీపిక పదుకునే మూడవ స్థానంలో ఉండేది. కాని ఇప్పుడు ఆ స్థానంను సాహో బ్యూటీ శ్రద్దా కపూర్‌ దక్కించుకుంది. దీపిక 52.3 మిలియన్‌ లతో ఉండగా శ్రద్దా మాత్రం చాలా తక్కువ సమయంలోనే 56.4 మిలియన్‌ లకు చేరింది. శ్రద్దా కపూర్‌ ఫాలోవర్స్‌ సంఖ్య చాలా స్పీడ్‌ గా పెరుగుతుంది. దీపిక పదుకునే పెళ్లి అవ్వడంతో పాటు ఈమద్య కాలంలో ఆమె చేసిన సినిమాలు ఏవీ కూడా ఓ గొప్ప సక్సెస్‌ అవ్వలేదు.

సాహో ఉత్తరాదిన మంచి విజయం సాధించడంతో పాటు ఆమె నటించిన ఇతర సినిమాలు కూడా పాజిటివ్‌ టాక్‌ ను దక్కించుకున్న కారణంగా శ్రద్ద కపూర్‌ ఫాలోవర్స్‌ గ్రాఫ్‌ అలా పైకి వెళ్లింది. చూడబోతుంటే త్వరలోనే ప్రియాంక చోప్రా ను కూడా క్రాస్‌ చేస్తుందేమో అనిపిస్తుంది. ప్రియాంక చోప్రా కూడా పెళ్లి చేసుకోవడంతో కాస్త అభిమానుల సంఖ్య హడావుడి తగ్గుతుంది. కనుక ఆమెను ఈజీగానే క్రాస్‌ చేసి కోహ్లీ తర్వాత స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు.