Begin typing your search above and press return to search.

అయ్యో పాపం.. పిల్ల కష్టపడిపోతోందే!

By:  Tupaki Desk   |   30 Oct 2018 12:01 PM IST
అయ్యో పాపం.. పిల్ల కష్టపడిపోతోందే!
X
పొద్దున్నే లేవడం అనేది చాలామందికి కష్టమైన విషయం. రాత్రి ఎంతసేపైనా మేలుకునేందుకు సై అంటారుగానీ పొద్దున్నే లేవమంటే నిట్టూరుస్తారు. కానీ బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ మాత్రం పొద్దున్నే లేవడం భలేగా ఉందని ఉత్సాహంగా చెబుతోంది. అలా అని ఆమెకు ముందునుండి ఇలా ఉదయాన్నే లేచే అలవాటు లేదట. మరి ఇప్పుడు ఎలా మారింది?

ప్రభాస్ నెక్స్ట్ ఫిలిం 'సాహో' లోనే కాకుండా శ్రద్ద మరో సినిమాలో కూడా నటిస్తోంది. బాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో శ్రద్ధ సైనా పాత్ర పోషిస్తోంది. దీంతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సహజంగా కన్పించేందుకు ఇప్పటికే బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంది. ప్రతి రోజూ ఉదయాన్నే లేచి బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని కోర్టులో చెమటలు చిందిస్తోంది.

తన ప్రాక్టిస్ గురించి మాట్లాడుతూ రోజూ పొద్దున్నే నిద్రలేస్తున్నానని.. దీంతో రోజులో చాలా సమయం ఉందనిపిస్తోందని చెప్పింది. "ఉదయం లేవడం భలేగా ఉంది. ఈ సినిమా పూర్తయినా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మానను.. ఈ అలవాటుని అస్సలు వదలను" అని చెప్పింది. అసలే సుకుమారి.. పొద్దున్నే లేవడం.. శ్రద్ధగా బ్యాడ్మింటన్ ఆడడం చూస్తుంటే "అయ్యో పాపం.. పిల్ల కష్టపడిపోతోందే!" అని మీకు అనిపించడం లేదా?