Begin typing your search above and press return to search.

సాహో కోసం కోట్లు అడిగారట!

By:  Tupaki Desk   |   16 May 2017 11:37 AM GMT
సాహో కోసం కోట్లు అడిగారట!
X
బాహబలి2 సాధించిన ఘన విజయం తర్వాత.. ప్రభాస్ మరుసటి చిత్రాన్ని కూడా దేశం మొత్తాన్ని ఆకర్షించేదిగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు యూవీ క్రియేషన్స్. అందుకే సుజిత్ దర్శకత్వంలో ప్రకటించిన సాహో చిత్రాన్ని.. తెలుగుతో పాటు హిందీ-తమిళ్-మలయాళ భాషల్లో కూడా చిత్రీకరించాలని ప్లాన్ చేసుకున్నారు.

150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో రూపొందించే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలన్నది నిర్మాతల ఆలోచన. అందుకే బాలీవుడ్ భామలతో మంతనాలు జరుపుతున్నారు. బాహుబలి2 గ్రాండ్ సక్సెస్ ను బేస్ చేసుకుని.. ప్రభాస్ కి హీరోయిన్ గా ఆఫర్ ఇస్తే.. ఎవరైనా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటారని మేకర్స్ భావిస్తే.. బాలీవుడ్ భామలందరూ తెగ షాకులు ఇచ్చేస్తున్నారట. గట్టిగా 3 కోట్ల రెమ్యూనరేషన్ రేంజ్ కూడా లేని శ్రద్ధా కపూర్.. సాహోలో నటించేందుకు ఏకంగా 8 కోట్లు అడిగిందట. లోఫర్ మూవీలో నటించిన దిశాపటానీని పలకరిస్తే.. 5 కోట్లు చెప్పి షాక్ కొట్టించేసింది.

మీడియం రేంజ్ హీరోయిన్స్ డిమాండే ఇలా ఉంటే.. ఇక ఫ్రంట్ లైన్ లో ఉన్న భామల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే.. దువ్వాడ జగన్నాధంలో నటిస్తున్న పూజా హెగ్డే.. 1నేనొక్కడినే చిత్రంలో కనిపించిన కృతి సనోన్ మాత్రమే కాసింత నార్మల్ ఫిగర్స్ చెప్పారట. వీరిలో ఒకరిని సాహో మూవీలో ప్రభాస్ పక్కన ఫైనల్ చేసే అవకాశాలున్నాయని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/