Begin typing your search above and press return to search.

ఫొటో టాక్ : నాభి సుంద‌రి నాజూకు సోకులేవీ?

By:  Tupaki Desk   |   7 Sept 2020 11:30 AM IST
ఫొటో టాక్ : నాభి సుంద‌రి నాజూకు సోకులేవీ?
X
ఫేడవుట్ భామ‌ల‌కు ఉన్న ఏకైక ఆప్ష‌న్ సోష‌ల్ మీడియానే. డిజిట‌ల్ మీడియా ద్వారా మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి వ‌చ్చేందుకు నానా పాట్లు ప‌డుతున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా ప‌టేల్ మొద‌లు ఇటీవ‌ల చాలామంది భామ‌లు ఈ వేదిక‌పై దుమారం రేపుతున్నారు. లేటు వ‌య‌సులోనూ హాట్ హాట్ ఫొటోల‌తో హీటెక్కించ‌డం ఆట‌విడుపుగా మారింది. ఎప్ప‌టి క‌ప్పుడు ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్న‌మే ఇదంతా. అదే ఫార్ములాని మ‌రో ఫేడ‌వుట్ భామ‌ శ్ర‌ద్ధా దాస్ అనుస‌రిస్తోంది.

తెలుగులో ఎన్ని చిత్రాల్లో న‌టించినా గుర్తింపు ద‌క్క‌క‌పోవ‌డంతో క‌న్న‌డ‌- బెంగాలి- హిందీ చిత్రాల్లో న‌టిస్తూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. అయినా త‌న‌కు ల‌క్కు చిక్క‌పోవ‌డంతో చివ‌రికి షార్ట్ ఫిల్మ్స్ ని కూడా వ‌ద‌ల‌డం లేదు. ఇన్ని చేసినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో పాపులారిటీ కోసం అమీషా ప‌టేల్ లా సోష‌ల్ మీడియాని వాడుకుంటోంది.

త‌న హాట్ హాట్ ఫొటోల‌ను.. వీడియోల‌ను షేర్ చేస్తూ అటెన్ష‌న్ క్రియేట్ చేస్తోంది. అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా శ్ర‌ద్దా దాస్ ఇన్ స్టా పేజ్‌లో ఓ గిఫ్ వీడియో‌ని షేర్ చేసింది. నాభి అందాల‌ని ప్ర‌ద‌ర్శిస్తూ బొద్దుత‌నాన్ని బ‌య‌ట పెట్టేసిందిలా. ఆమె న‌డుము నాజూకు అనుకుందో ఏమో కానీ.. న‌డుమందాల‌ని ప్ర‌ద‌ర్శించిందిలా. ఇంతగా రెచ్చగొట్టేస్తున్న శ్ర‌ద్దా అందాల‌కు త‌గ్గ ఆఫ‌ర్ల‌ని ఇప్పటికైనా మ‌న ద‌ర్శ‌కులు ఇస్తారో చూడాలి.