Begin typing your search above and press return to search.
ఇంత చిన్నదానికి జర్నలిస్ట్ లకు అంత పెద్ద వార్నింగ్ ఏంటీ అమ్మడు?
By: Tupaki Desk | 28 July 2020 11:00 AM ISTఈమద్య సోషల్ మీడియా వెబ్ మీడియాలో సెలబ్రెటీల గురించి ప్రతి రోజు ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంది. అయితే ఆ పుకార్ల వల్ల పాపులారిటీ వస్తుందని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఆ పుకార్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. కాని శ్రద్దా దాస్ మాత్రం ఒక చిన్న పుకారుకు మరీ సీరియస్ అయ్యింది. ఫైనల్ వార్నింగ్ అంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లపై పోలీసు కేసు పెడతానంటూ మాట్లాడటం ప్రస్తుతం మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఇంతకు ఆమె మీద వచ్చిన పుకారు ఏంటీ అంటే స్టార్ మాలో వచ్చే నెల నుండి ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 4లో ఈమె కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని షో నిర్వాహకులు ఇప్పటికే ఈమెను సంప్రదించారు అంటూ వార్తలు వచ్చాయి. ఈమె గురించే కాకుండా చాలా మంది హీరోయిన్స్ ఇతర సెలబ్రెటీల గురించి కూడా పుకార్లు వచ్చాయి. అయితే కొందరు మాత్రం లైట్ తీసుకోకగా కొందరు తాము బిగ్ బాస్ లో భాగం కాబోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాని శ్రద్దా మాత్రం ఈ పుకార్లకే పోలీసు కేసు వరకు వెళ్లింది.
కొందరు హీరోయిన్స్ తమపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వచ్చినా బ్యాడ్‌కామెంట్స్ వచ్చినా కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తారు. కాని శ్రద్దా మాత్రం బిగ్ బాస్ లో పాల్గొనబోతుందట అంటూ వార్తలు వచ్చినందుకే నానా రచ్చ చేస్తోంది. ఏదో చిన్న విషయానికి ఇంతలా స్పందించడం ఏంటో అంటూ సోషల్ మీడియా నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. తాను బిగ్ బాస్ లో పాల్గొనబోవడం లేదంటే సరిపోతుంది కదా ఎందుకు మరీ ఇంత రచ్చ అంటు ప్రశ్నిస్తున్నారు.