Begin typing your search above and press return to search.

గొడ‌వ బ్యూటీ మ‌ళ్లీ బికినీలో తేలిందిలా

By:  Tupaki Desk   |   30 April 2021 1:30 PM GMT
గొడ‌వ బ్యూటీ మ‌ళ్లీ బికినీలో తేలిందిలా
X
ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి కుమారుడు వైభవ్ స‌ర‌స‌న గొడవ (2007) అనే చిత్రంలో న‌టించింది శ్ర‌ద్ధా ఆర్య‌. ఆ సినిమా ఆక‌ట్టుకోక‌పోయినా శ్ర‌ద్ధా అంద‌చందాలు తెలుగు యువ‌త‌కు క‌నెక్ట‌య్యాయి. ఆ త‌ర్వాత 2010లో కోతి మూక - రోమియో అనే రెండు చిత్రాల్లో న‌టించింది. ఇవేవీ అంత‌గా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత క‌న్న‌డ మ‌ల‌యాళంలోనూ న‌టించింది. డ‌బుల్ డెక్క‌ర్ అనే చిత్రంతో విజ‌యం అందుకుంది. అటుపై ఈ బ్యూటీ హిందీ బుల్లితెర‌కు వెళ్లి బిజీ అయ్యింది.

బుల్లితెర‌పై `కుండలి భాగ్య`తో శ్ర‌ద్ధా ఆర్య బాగా ఫేమ‌స్ అయ్యింది. ఈ షోతో కరణ్ -ప్రీత అకా శ్రద్ధా ఆర్య - ధీరజ్ ధూపర్ లతో పాటు అనేక సమాంతర పాత్రలకు మంచి పేరొచ్చింది. మ‌హారాష్ట్ర -ముంబైలో కరోనావైరస్ కేసులు పెరగడం వల్ల లాక్ డౌన్ కారణంగా అనేక టీవీ కార్యక్రమాలు నిలిచిపోయాయి.

కుంకుమ్ భాగ్యతో పాటు కుండలి భాగ్య ఇతర టీవీ షోలు ముంబై నుంచి షిఫ్ట్ అయ్యి గోవాలో షూటింగ్ లు జ‌రుపుకుంటున్నాయి. ఇక గోవా లాంటి చోటికి వ‌స్తే శ్ర‌ద్ధా ఊరుకుంటుందా? ఇదిగో ఇలా బికినీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. బ్లాక్ బికినీలో ఒక్క‌సారిగా అగ్గి రాజేసింది. ఈ రేంజులో మ‌ళ్లీ టాలీవుడ్ లో అడుగుపెడితే క‌ల్లోల‌మే అన్న గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

బికినీ ఫోటోల‌తో పాటు శ్ర‌ద్ధా ఇత‌ర సెల‌బ్రేష‌న్స్ కూడా సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవల శ్రద్ధా ఆర్య తన సోషల్ మీడియాల్లో ఆన్ స్క్రీన్ సోదరి శ్రీష్టా అంజుమ్ ఫకీహ్ తో క‌లిసి దిగిన‌ గూఫీ చిత్రాలను పంచుకుంది. ఇరువురు నిజ జీవితంలోనూ స్నేహితులు కాబ‌ట్టి... బీచ్ లో చిల్లింగ్ ఫోటోల‌తో అంద‌రినీ అల‌రించారు.