Begin typing your search above and press return to search.

మూడు సినిమాలు 'పరీక్ష' పాసవుతాయా?

By:  Tupaki Desk   |   4 March 2016 11:00 PM IST
మూడు సినిమాలు పరీక్ష పాసవుతాయా?
X
ఈ వారం మూడు డైరెక్ట్ సినిమాలు తెరపైకి వచ్చాయి. పెద్ద సినిమాలతో టఫ్ కాంపిటీషన్ లో నిలబడకుండా, ఎలక్షన్స్ లాంటి హంగామాలు లేకుండా ప్లాన్డ్ గానే విడుదల చేసుకున్నారు నిర్మాతలు. కానీ మూడు సినిమాలకు 'పరీక్షలు' పరీక్ష పెడుతున్నాయి. ప్రస్తుతం యాన్యువల్ ఎగ్జామ్స్ మొదలయ్యే సీజన్. సినిమాలకు మహారాజ పోషకులైన స్టూడెంట్స్ అంతా ఇప్పుడు ఎగ్జామ్స్ హడావిడిలో పడిపోయారు. ఫుల్లుగా ప్రిపరేషన్ లో ఉండిపోయారు.

ఈ ఎఫెక్ట్ బాక్సాఫీస్ పై బాగానే కనిపించేటట్టుగా ఉంది. కానీ ఆ పరీక్షల కంటే ముందు.. ఈ మూడు మూవీస్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంది. గుంటూరు టాకీస్ విషయానికొస్తే ప్రవీణ్ సత్తారు, శ్రద్ధాదాస్ లకు హిట్ చాలా అవసరం. హీరోయిన్ గా వెలిగిపోదామని అనుకుంటున్న రష్మీనే నమ్ముకున్నారు. యాంకర్ గా ఫేమస్ అయినా.. హీరోయిన్ గా రష్మీకి గుంటూరు టాకీస్ హిట్ కావడం చాలా ముఖ్యం. ఇక జబర్దస్త్ మూవీతో జబర్దస్త్ ఫ్లాప్ కొట్టిన నందినీ రెడ్డికి, కుర్ర హీరో నాగశౌర్యకు.. కళ్యాణ వైభోగమే ఆడ్డం - నిలబడ్డం, విజయం సాధించడం చాలా అవసరం కూడా.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మనోజ్-దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన శౌర్య పరిస్థితి కూడా ఇదే. మనోజ్ - దశరథ్ లు కంపల్సరీ హిట్ కొట్టాల్సి ఉండగా.. హీరోయిన్ రెజీనా పరిస్థితి కూడా ఏం తేడా లేదు. మరి ఇంతమంది ఆశలకు పరీక్ష పెడుతోంద 'పరీక్షలే'. మరి ఈ ఎగ్జామ్ లో ఎవరు పాసవుతారో తెలియాలంటే. వీకెండ్ పూర్తయ్యే వరకూ ఆగాల్సిందే.