Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరోకు సర్జరీ

By:  Tupaki Desk   |   14 March 2020 9:10 AM GMT
యంగ్‌ హీరోకు సర్జరీ
X
ఇటీవలే జాను చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్‌ నటుడిగా మంచి మార్కులు పొందిన కమర్షియల్‌ సక్సెస్‌ ను మాత్రం దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. జాను చిత్రం నిరాశ పర్చడం తో శ్రీకారం చిత్రం తో మరో ప్రయత్నానికి శర్వా రెడీ అయ్యాడు. శ్రీకారం చిత్రం షూటింగ్‌ ను ఇటీవలే పూర్తి చేసుకున్న శర్వానంద్‌ అమెరికా వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది. అమెరికాలో ఆయన భుజానికి సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది.

జాను చిత్రం షూటింగ్‌ సందర్బంగా శర్వానంద్‌ ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే శర్వానంద్‌ కు సర్జరీ అవసరం అంటూ డాక్టర్లు సూచించారట. కాని శర్వానంద్‌ జాను చిత్రంను పూర్తి చేయడం తో పాటు శ్రీకారం చిత్రాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉండటం తో ఆపరేషన్‌ ను వాయిదా వేసుకున్నాడట. శ్రీకారం పూర్తి అవ్వడంతో ఇప్పుడు వెళ్లి అమెరికాలో సర్జరీ చేయించుకున్నాడట.

ఒకటి రెండు రోజుల్లో శర్వానంద్‌ హైదరాబాద్‌ కు తిరిగి రాబోతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్‌ కు వచ్చిన తర్వాత మూడు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. శ్రీకారం సినిమా సమ్మర్‌ రిలీజ్‌ అనుకున్నా ప్రస్తుతం కరోనా కల్లోలంలో విడుదల చేయడం అనుమానంగానే ఉంది. ఇప్పటికే పలు సినిమాలు విడుదల వాయిదా పడుతున్నాయి. శ్రీకారం కూడా వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు.