Begin typing your search above and press return to search.

'సలార్‌' రిలీజ్ మ‌రింత వెన‌క్కి వెళ్ల‌నుందా?

By:  Tupaki Desk   |   30 March 2022 11:30 AM GMT
సలార్‌ రిలీజ్ మ‌రింత వెన‌క్కి వెళ్ల‌నుందా?
X
భారీ అంచ‌నాలు పెట్టుకుని చేసిన `సాహో` ఆశించిన స్థాయి విజ‌యాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. దీంతో వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని లైన్ లో పెట్టేసి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ల‌ని ప్లాన్ చేయాల‌ని ప్ర‌భాస్ భావించారు. ఇందులో భాగంఆనే వ‌రుస‌గా సినిమాల్ని పూర్తి చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో `రాధేశ్యామ్‌` త‌రువాత స‌లార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలున్నాయి. త్వ‌ర‌లో మారుతి సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

ఇదిలా వుంటే ఈ చిత్రాల్లో ఇప్ప‌టికే `ఆది పురుష్‌` చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం స‌లార్‌, ప్రాజెక్ట్ కె చిత్రాలు సెట్స్ పై వున్నాయి. సందీప్ రెడ్డి వంగ `స్పిరిట్‌` సెట్స్ పైకి రావాల్సి వుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీగా వున్న ప్ర‌భాస్ ఈ చిత్రాలలో ముందుగా `స‌లార్‌`ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తార‌ని అంతా భావించారు. ప్ర‌శాంత్ నీల్ స్పీడు చూసి ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు వినిపించాయి.

అయితే ఈ మూవీ అనుకున్న స‌మ‌యం కంటే మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్న‌ట్టుగా తెలుస్తోంది. `రాధేశ్యామ్‌` ప్ర‌మోష‌న్స్ కోసం `స‌లార్‌` షూటింగ్ కి ప్ర‌భాస్ బ్రేకిచ్చారు.

అయితే ఇటీవ‌ల స‌లార్ షూటింగ్ లో జ‌రిగిన ప్ర‌మాదం కార‌ణంగా ప్ర‌భాస్ భుజానికి అయిన గాయం మ‌ళ్లీ తిర‌గ‌తోడ‌టం.. గాయాన్ని ప‌రిశీలించిన డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని సూచించ‌డంతో ప్ర‌భాస్ మైన‌ర్ స‌ర్జ‌రీ కోసం `రాధేశ్యామ్` రిలీజ్ త‌రవాత స్పెయిన్ వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌లే స‌ర్జ‌రీ పూర్త‌యింది. ప్ర‌స్తుతం డాక్ట‌ర్ ల స‌ల‌హా మేర‌కు ప్ర‌భాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయ‌న కోలుకుని మ‌ళ్లీ `స‌లార్‌` షూటింగ్ లో పాల్గొన‌డానికి దాదాపు రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. దీంతో `స‌లార్‌` షూటింగ్ ఆల‌స్యం కానుంద‌ని, ఈ కార‌ణంగా సినిమా రిలీజ్ కూడా మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు `స‌లార్‌` దాదాపుగా 30 శాతానికి మించి చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మిగ‌తా భాగం పూర్తి చేసి సినిమాని ఈ ఊడాది చివ‌ర‌లో కానీ వ‌చ్చే ఏడాది కానీ రిలీజ్ చేసే అవ‌కాశాలు వున్నాయ‌ని చెబుతున్నారు. ఇది నిజంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాకింగ్ న్యూసే.