Begin typing your search above and press return to search.

షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడంతో 'సర్కారు వారి' రిలీజ్ డేట్ మారనుందా..??

By:  Tupaki Desk   |   29 March 2021 4:30 PM GMT
షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడంతో సర్కారు వారి రిలీజ్ డేట్ మారనుందా..??
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే దుబాయ్ లో 'సర్కారు వారి పాట' లాంగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ తదుపరి షెడ్యూల్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. పక్కా వినోదాత్మక కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే దుబాయ్ లో దాదాపు నెలరోజుల పాటు భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది సర్కార్ టీమ్. త్వరలోనే మరో భారీ షెడ్యూల్ షూట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇదివరకు సర్కారు వారి తదుపరి షెడ్యూల్ అమెరికాలో ఉండబోతుందని.. అక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ కరోనా వలన అమెరికా క్యాన్సిల్ చేసి గోవా ఫిక్స్ చేశారు మేకర్స్. గోవాలోనే ఓ అందమైన పాటను షూట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో కూడా క్యాన్సిల్ అయినట్లు సమాచారం. కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న కారణంగా గోవా షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మార్చ్ చివరిలో సర్కారు బృందం దాదాపు మరో నెలపాటు షూటింగ్ జరపాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారట. గోవాలో షూట్ పూర్తయ్యాక మిగతా షూటింగ్ హైదరాబాద్ లో జరగాల్సింది. కానీ ఇప్పుడు గోవా షెడ్యూల్ కూడా రద్దు అనేసరికి మళ్లీ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అలాగే ఆ ప్రభావం సినిమా రిలీజ్ డేట్ పై కూడా పడే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు నిర్మాతలు. కానీ ఇప్పుడు షూటింగ్ రద్దు కావడంతో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఫస్ట్ టైం కీర్తిసురేష్ మహేష్ తో రొమాన్స్ చేయనుంది. చూడాలి మరి త్వరలో షెడ్యూల్ డేట్ ప్రకటిస్తారేమో!