Begin typing your search above and press return to search.

రెండు వారాలు పర్సనల్ లాక్ డౌన్ పాటించండి: నాగ్ అశ్విన్

By:  Tupaki Desk   |   29 April 2021 8:30 AM GMT
రెండు వారాలు పర్సనల్ లాక్ డౌన్ పాటించండి: నాగ్ అశ్విన్
X
మన దేశంలో కోవిడ్ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో పలువురు సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా సోషల్ మీడియా వేదికగా జనాలకు ధైర్యం చెబుతూ జాగ్రత్తలు పాటించమని చెబుతూ వస్తున్నారు. మరికొందరు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి కారణంగా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న దేశాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చి తమ వంతు సహాయం చేస్తున్నారు. అయితే 'మహానటి' దర్శకుడు నాగ అశ్విన్ ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులను తెలియచేస్తూ రెండు వారాల పాటు అందరూ పర్సనల్ లాక్ డౌన్ పాటిస్తే మంచిదని.. దీని వల్ల డాక్టర్లకి కాస్త విశ్రాంతి దొరుకుతుందని ట్విట్టర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా, ప్రకటించకపోయినా.. వచ్చే 2 వారాలు అందరూ వ్యక్తిగత లాక్ డౌన్ అయి ఉండమని నాగ్ అశ్విన్ చెబుతున్నారు. లాక్ డౌన్ సమాధానం కాదని చెప్పేవారు దయచేసి ఒకసారి హాస్పిటల్స్ కి వెళ్లి పరిస్థితి చూడాలని.. వైద్య సిబ్బంది గత నెల రోజులుగా ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా డాక్టర్లు మనకు కరోనా వాక్సినేషన్ చేస్తూ అలసిపోయారని.. అందుకే మనం తప్పకుండా వారికి కొంత ఉపశమనం కలిగించాలని నాగ్ అశ్విన్ అన్నారు. అందుకే రెండు వారాలు అందరూ వ్యక్తిగత లాక్ డౌన్ పాటిస్తే డాక్టర్లకు కాస్త రెస్ట్ దొరుకుతుందని ఆయన అభిప్రాయం. నాగ్ అశ్విన్ తో కొందరు ఏకీభవిస్తుండగా.. మరికొందరు రోజువారీ పనులు చేసుకునే పేదలకు ఇది ఇబ్బందులు తెచ్చి పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.