Begin typing your search above and press return to search.
భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలపై మరో భారం పడనుందా...?
By: Tupaki Desk | 11 Sept 2020 5:00 AM ISTకరోనా మహమ్మారి కారణం గా సినీ ఇండస్ట్రీ గతం లో ఎప్పుడూ లేని విధంగా ఆరు నెలలు మూతబడి ఉంది. సినిమా పుట్టినప్పటి నుంచి కూడా సినీ ఇండస్ట్రీకి పెద్దగా బ్రేక్ పడింది లేదు. సినీ ఇండస్ట్రీ గతంలో అనేక విపత్తులు ఎదుర్కొన్నప్పటికీ ఈ రేంజ్ లో నష్టం చవి చూడలేదు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నా కూడా సినిమా కార్యకలాపాలు కొనసాగుతూనే ఉండేవట. కానీ కంటికి కనిపించని వైరస్ ఊహించని విధంగా సినీ ఇండస్ట్రీ పై ఎఫెక్ట్ చూపించింది. సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడింది.. థియేటర్స్ క్లోజ్ అయ్యాయి.. దీంతో రిలీజులు ఆగిపోయాయి. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ చాలా మంది మేకర్స్ ఇప్పుడిప్పుడే ధైర్యంగా షూటింగ్స్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే కరోనా కారణం గా ఇప్పటికే నష్టాల లో కూరుకు పోయున్న పెద్ద సినిమాల నిర్మాతల పై మరింత భారం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
కాగా టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశ లో ఆగి పోయిన సినిమాల్లో 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' 'ఆచార్య' 'పుష్ప' సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్నాయి. వీటిలో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం కంప్లీట్ అయింది. స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే అనేక అవాంతరాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే పెరుగుతూ వచ్చిందని టాక్. దీనికి తోడు కరోనా కారణం గా ఆరు నెలల సమయం వృధాగా పోయింది. సినిమా షూటింగ్ ఇంకా 30శాతం పూర్తి చేయాల్సి ఉంది. కరోనా వైరస్ అదుపులోకి వస్తే వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే అన్ని సినిమాల్లాగా తక్కువ మంచిదో 'ఆర్.ఆర్.ఆర్' షూట్ చేయడం సాధ్యపడదు. మళ్ళీ షూటింగ్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక సినిమా షూటింగ్స్ ని వీలైనంత త్వరహా పూర్తి చేయాలనే క్రమంలో బడ్జెట్ కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నైట్ షూట్స్ కూడా పెట్టుకుంటే పేమెంట్స్ కూడా డబుల్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులోనూ అవుట్ డోర్ షూటింగ్స్ చేసే అవకాశం లేకవడంతో ఇక్కడే సెట్స్ వేసి చిత్రీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రొడ్యూసర్ పై అదనపు భారం పడే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.
'డార్లింగ్' ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' కూడా మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గోపికృష్ణ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాని ఫారిన్ లొకేషన్స్ లో షూట్ చేస్తుండగా కరోనా రావడంతో ఇండియాకి వచ్చేసారు. ఇప్పుడు కొన్ని సీన్స్ కోసం ఇక్కడే సెట్స్ వేస్తున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూట్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలని సన్నాహకాలు చేసుకుంటున్నారు. దీని కోసం ఇప్పటికే సెట్స్ నిర్మాణం కూడా చేపట్టారని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్స్ ఆరు నెలలకు పైగా వాయిదా పడటంతో ప్రొడ్యూసర్స్ కి వడ్డీలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకుంటే భారీ చిత్రాలను తీసే నిర్మాతలపై మరింత భారం పడనుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.