Begin typing your search above and press return to search.

కలకలం: సానియా మీర్జా ఫాంహౌస్ దగ్గర కాల్పులు

By:  Tupaki Desk   |   27 Oct 2020 4:30 PM GMT
కలకలం: సానియా మీర్జా ఫాంహౌస్ దగ్గర కాల్పులు
X
తెలంగాణలో తాజాగా వికారాబాద్ అడవుల్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పోలీసుల విచారణలో ఓ సెలబ్రెటీ ఫామ్ హౌస్ వద్దే ఇది జరిగిందని తేలింది.

దామగుండంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అలాగే ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఆ ఫామ్ హౌస్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఫామ్ హౌస్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ నిర్వాహకులు తమను బెదిరిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ఫాంహౌస్ నిర్వాహకులు, సిబ్బందిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో కాల్పుల ఘటనపై కీలక సమాచారం సేకరించారు.

స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వార్ నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఆవుకు బుల్లెట్ గాయాల ఘటన తర్వాత ఫాంహౌస్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఫాంహౌస్ కు చెందినవారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.