Begin typing your search above and press return to search.
ధారావి గజగజ..అయోమయంలో `ఫైటర్`
By: Tupaki Desk | 23 April 2020 10:30 AM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో `ఫైటర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈ సినిమాని ప్రారంభించారు. దాదాపు 70 శాతం షూటింగ్ అక్కడే ఉంటుందని పూరి ముందుగానే రివీల్ చేసారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ.. విజయ్ ని నెక్స్ట్ లెవల్లో చూపించే చిత్రమిదని తొలినుంచి అంచనాలేర్పడ్డాయి. ముంబైలోనే ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుందని.. అటుపై కొంతభాగం హైదరాబాద్ లో చిత్రీకరించాల్సి ఉంటుందని రివీల్ చేసారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ట్రబుల్ గురించి సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ముంబైలో నానాటికి కొవిడ్ -19 బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. మహారాష్ట్ర కరోనా కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఆసియాలోనే అతి పెద్ద స్లమ్ గా పేర్గాంచిన ముంబై ధారావిలో కరోనా కోరలు చాచి విజృంభిస్తోంది. చాలా కేసులు ధారావి నుంచే నమోదవుతున్నాయి. ఇప్పుడు ఆ స్లమ్ పేరెత్తితో దేశ వ్యాప్తంగా ప్రజల గుండెల్లో ఒణుకు పుడుతోంది. అయితే పూరి ఫైటర్ కి ధారావి కనెక్షన్ బెంగ పెట్టుకునేలా చేస్తోందట. విజయ్ పై చిత్రీకరించాల్సిన చాలా సన్నివేశాలు ధారావిలోనే చేయాల్సి ఉందిట. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మే 3 తో లాక్ డౌన్ ముగిసినా ధారావిలో అక్కడ ప్రభుత్వం సడలింపును ఇచ్చే పరిస్థితి అయితే లేదు. యథా విథిగా లాక్ డౌన్ కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు.
అదే గనుక జరిగితే ఫైటర్ మరో నాలుగు నెలలు పాటు షూటింగ్ వాయిదా పడుతుందని సమాచారం. పూరి ధారావి స్లమ్ ఆధారం చేసుకునే చాలా సన్నివేశాలు రాసుకున్నారుట. ఇక ఆయన సెట్లు వేయరన్న సంగతి తెలిసిందే. పబ్లిక్ ప్లేస్ ల్లోనే మెజారిటీ షూటింగ్ చుట్టేస్తారు. గతంలో బిజినెమెన్ సినిమా షూటింగ్ ను ఒక్క సెట్ కూడా వేయకుండా ధారావిలోనే షూట్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ తోనూ ఆ విధంగానే చుట్టేయాలని ప్లాన్ చేసారు. మరి తాజా పరిస్థితులు పూరి కి అనుకూలంగా లేవు కాబట్టి లోకేషన్ ఛేంజ్ ఏదైనా ఉంటుందా? అన్నది చూడాలి. అయితే ఈ నాలుగు నెలల గ్యాప్ లో రౌడీ స్టార్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడుట. వివేక్ ఆత్రయే దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తే బాగుంటుదని ప్లాన్ చేస్తున్నాడుట. వివేక్ గతంలోనే వినిపించిన స్క్రిప్ట్ ఇది. చేస్తే బాగుంటుందని విజయ్ భావిస్తున్నాడుట. అయితే విజయ్ ని వదలాలా.. లేదా? అన్న నిర్ణయం మాత్రం పూరి చేతుల్లోనే ఉంది.