Begin typing your search above and press return to search.

అక్క‌డే షూటింగ్‌..అక్క‌డే ప్ర‌మోష‌న్స్‌..వాటే ప్లానింగ్‌!

By:  Tupaki Desk   |   19 Sep 2022 10:30 AM GMT
అక్క‌డే షూటింగ్‌..అక్క‌డే ప్ర‌మోష‌న్స్‌..వాటే ప్లానింగ్‌!
X
బంతిని ఎంత తొక్కితే అంత‌గా పైకి లేస్తూ వుంటుంది. యంగ్ హీరో నిఖిల్ కెరీర్ కూడా 'కార్తికేయ‌' మూవీ నుంచి ఇదే పంథాలో సాగుతోంది. కొన్ని సంద‌ర్భాల్లో విధి త‌న సినిమాల‌కు అడ్డుగా నిలిచినా.. కొన్ని సంద‌ర్భాల్లో త‌న సినిమా రిలీజ్ ని వ‌రుస‌గా ప‌నిగ‌ట్టుకుని వాయాదా వేయించినా అదే నిఖిల్ పాలిట వ‌రంగా మారి అత‌నికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందిస్తోంది.

కార్తికేయ, అర్జున్ సుర‌వ‌రం, అంత‌కు ముందు విడుద‌లైన‌ 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ‌.. రీసెంట్ గా విడుద‌లైన 'కార్తికేయ 2' వ‌ర‌కు రిలీజ్ విష‌యంలో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని చివ‌రికి బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి.

దీంతో నిఖిల్ సినిమాల‌కు రీలీజ్ డిలే సిండ్రోమ్ సెంటిమెంట్ గా మారింది. చందూ మొండేటి డైరెక్ష‌న్ లో నిఖిల్ న‌టించిన మిస్టిక్ అడ్వెంచ‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'కార్తికేయ 2' రెండు సార్లు వాయిదాప‌డి ఎట్ట‌కేల‌కు ఆగ‌స్టు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఊహించ‌ని విధంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఉత్త‌రాదిలో చిన్న సినిమాగా లిమిటెడ్ థియేట‌ర్ల‌లో ముందు విడుద‌లైన ఈ మూవీకి ఆ త‌రువాత వెయ్యికి పైగా థియేట‌ర్లు ల‌భించ‌డం, రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా ఉత్త‌రాదిలోని హిందీ బెల్ట్ లో ఈ మూవీ రూ. 30 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం రికార్డుగా నిలిచింది.

ఇప్ప‌టి ఉద్ద‌రాదిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 120 మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ మూవీని కేర‌ళ‌లో ఇంత వ‌ర‌కు చిత్ర బృందం ఈ మూవీని రిలీజ్ చేయ‌లేదు.

సెప్టెంబ‌ర్ 23న అక్క‌డ రిలీజ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కేర‌ళ‌లో నిఖిల్ న‌టిస్తున్న మ‌రో పాన్ ఇండియా మూవీ 'స్పై' షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఒ ప‌క్క 'కార్తికేయ 2' ప్రమోష‌న్స్ చేస్తూనే నిఖిల్ తను న‌టిస్తున్న స్పై థ్రిల్ల‌ర్ 'స్పై' షూటింగ్ లో పాల్గొంటుండ‌టం విశేషం. 'స్పై' మూవీని గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌ల‌పాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీని ఐదు భాష‌ల్లో ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.