Begin typing your search above and press return to search.

ఓమిక్రాన్ తో షూట్ బంద్.. ప్రభాస్ మిస్సింగ్!!

By:  Tupaki Desk   |   12 Jan 2022 4:30 AM GMT
ఓమిక్రాన్ తో షూట్ బంద్.. ప్రభాస్ మిస్సింగ్!!
X
పాన్ ఇండియా సినిమాలు చేయ‌డ‌మంటే ఆషామాషీనా? వ‌ర్క్ ప్రెజెర్ అంతే ఘ‌నంగా ఉంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌న్నివేశం ఎలా ఉంది? అంటే.. ప‌ని ఒత్తిళ్ల‌తో రెస్ట్ తీస్కునే టైమ్ లేక‌.. నిరంత‌రం బిజీ షెడ్యూళ్ల‌తోనే గ‌డిపాడు. చిన్న స‌మ‌యం దొరికినా గ్యాప్ లో కొత్త స‌బ్జెక్టులు కొత్త డైరెక్ట‌ర్లతో మంత‌నాలు సాగిస్తూ అస‌లు రాజీ అన్న‌దే లేకుండా ముందుకు సాగుతున్నాడు. అస‌లు పెళ్లి మాటే ఎత్త‌కుండా ఈ సీనియ‌ర్ బ్యాచిలర్ త‌న బిజీ లైఫ్ ని కొన‌సాగిస్తున్నాడు. స‌ల్మాన్ త‌ర్వాత మ‌ళ్లీ ప్రభాసే అన్నంతగా ఉంది స‌న్నివేశం.

ఇటీవ‌ల ఓమిక్రాన్ భయం షూటింగ్ లను రద్దు చేసింది. మ‌రి ఈ స‌మ‌యంలో ప్రభాస్ ఏం చేస్తున్నాడు? అంటే.. ప్రభాస్ అంతా స‌రిగా ఉంటే రాధే శ్యామ్ రిలీజ్ ముందు ప్ర‌చారం హ‌డావుడిలో ఉండేవాడు. అత‌డి అభిమానుల‌తో ఇంట‌రాక్ష‌న్స్ ఉండేవి. రాధేశ్యామ్ ఈ వారం విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ భయం కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది.

దీంతో ప్రభాస్ అండర్ గ్రౌండ్‌కి వెళ్లి తనకు అవసరమైన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం ఆయన హిందీ చిత్రాలకు స్క్రిప్ట్ లు వింటున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఇద్దరు యువ అప్ క‌మ్ హిందీ డైరెక్ట‌ర్స్ ప్రభాస్ కి స్క్రిప్ట్ లను వినిపించారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌శాంత్ నీల్ తో - సలార్.. నాగ్ అశ్విన్ తో- ప్రాజెక్ట్ కే.. ఓంరౌత్ తో- ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ‌లు సాగుతున్నాయి. త‌దుప‌రి అత‌డితో సందీప్ వంగా స్పిరిట్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తారు. అనంత‌రం ఏ లక్కీ డైరెక్టర్ కి ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందో చూడాలి. ఇంత‌కుముందు సాహో తో న‌వ‌త‌రం ట్యాలెంట్ సుజీత్ కి అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌భాస్ ఈసారి కూడా న‌వ‌త‌రానికి అవ‌కాశం క‌ల్పిస్తాడా? అన్న‌ది వేచి చూడాలి.