Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం బుల్లితెర మీదా డిజాస్టరే..

By:  Tupaki Desk   |   20 Oct 2016 1:53 PM GMT
బ్రహ్మోత్సవం బుల్లితెర మీదా డిజాస్టరే..
X
మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత దారుణమైన ఫలితాన్నందుకున్న సినిమా ఏదంటే.. నిస్సందేహంగా ‘బ్రహ్మోత్సవం’ అనే చెప్పాలి. దీని కంటే ముందు మహేష్ కెరీర్లో డిజాస్టర్లు ఉన్నాయి కానీ.. దీనికి వచ్చినన్ని విమర్శలు ఇంకేదానికీ రాలేదు. అంత పాజిటివ్ బజ్ తెచ్చుకుని అంత పెద్ద డిజాస్టర్ అవడం ఇంకే సినిమాలోనూ జరగలేదు. సినిమా ఆడకపోవడం కంటే కూడా దీని విషయంలో పడ్డ సెటైర్లే మహేష్ అండ్ కోకు పెద్ద షాక్.

ఐతే కేవలం థియేట్రికల్ రన్ వరకే ‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ ఆగలేదు. బుల్లితెర మీద కూడా బ్రహ్మోత్సవం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మహేష్ కెరీర్లోనే ఎన్నడూ లేని అథమ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇటీవలే జీ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేయగా.. కేవలం 7.52 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఈ మధ్య కాలంలో ఫ్లాప్ అయినా సరే.. స్టార్ హీరోల సినిమాల్లో ఇంత తక్కువ టీఆర్పీ తెచ్చుకున్న సినిమా ఇంకేదీ కనిపించదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘బ్రహ్మోత్సవం’ కంటే ముందు వచ్చి ఇలాగే డిజాస్టర్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ 15.24 రేటింగ్ తెచ్చుకోవడం విషయం. మహేష్ లాస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ బాగా వర్కవుట్ కావడంతో జీటీవీ ‘బ్రహ్మోత్సవం’ శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడి రూ.11.2 కోట్లు పెట్టేసింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆ ఛానెల్ కు నష్టాలు తప్పేలా లేవు. ఇక ఈ ఏడాది టాపీ టీఆర్పీల లిస్టు చూస్తే.. ‘బిచ్చగాడు’ సినిమా 18.75 రేటింగ్ తో అగ్రస్థానంలో నిలవగా.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాతి స్థానంలో ఉంది. సుప్రీమ్ (14.79).. నేను శైలజ (12.37).. నాన్నకు ప్రేమతో (12.23) రేటింగులతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/