Begin typing your search above and press return to search.

అనుష్క‌ను పెళ్లాడే ఆ దుబాయ్ బిజినెస్ మేన్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   29 April 2021 5:31 AM GMT
అనుష్క‌ను పెళ్లాడే ఆ దుబాయ్ బిజినెస్ మేన్ ఎవ‌రు?
X
స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి గురించి చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవ‌ల అనుష్క కెరీర్ కి పెద్ద బ్రేక్ నివ్వ‌డానికి కార‌ణం ఇంట్లోవాళ్లు త‌న‌కు పెళ్లి చేసే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌డ‌మేన‌ని ప్ర‌చార‌మైంది. ఇక ప్ర‌భాస్ తో పెళ్లి అంటూ సాగిన ప్ర‌చారానికి అనుష్క .. ప్ర‌భాస్ ఇద్ద‌రూ చెక్ పెట్టారు. తాము స్నేహితులం మాత్ర‌మేన‌ని ప‌లు సంద‌ర్భాల్లో వివ‌ర‌ణ ఇచ్చారు.

తాజాగా ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల గుస‌గుస‌లు మ‌రో కొత్త అప్ డేట్ ని వెల్ల‌డిస్తున్నాయి. అనుష్క‌కు పెళ్లి కుదిరింది. అత‌డు దుబాయ్ లో పెద్ద బిజినెస్ మేన్ కుమారుడు. త‌న‌కంటే చిన్న‌వాడు! క‌రోనా ప‌రిస్థితులు స‌ద్ధుమ‌ణిగాక ఈ జంట‌కు పెళ్లి జ‌రుగుతుంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే ఇది నిజ‌మా? కాదా? అన్న‌ది అనుష్క‌నే ధృవీక‌రించాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి సినిమాల‌కు బ్రేక్ నివ్వ‌డంతో ఇలాంటి రూమ‌ర్లు స‌హ‌జం. కానీ వాటిని ఖండించ‌క‌పోతే అదే నిజ‌మ‌ని అభిమానులు భావించేందుకు ఆస్కారం ఉంది. అలాగే అనుష్క శెట్టి- న‌వీన్ పోలిశెట్టి జంట‌గా యువి క్రియేష‌న్స్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇది కూడా త‌న కంటే త‌క్కువ వ‌య‌సున్న కుర్రాడితో ప్రేమాయ‌ణం సాగించే అమ్మాయి క‌థ అన్న పాయింట్ ఆస‌క్తిని పెంచుతోంది.