Begin typing your search above and press return to search.

'జ‌నగ‌ణ‌మ‌న‌'కు బుట్ట‌బొమ్మ రేటెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   6 Jun 2022 5:29 AM GMT
జ‌నగ‌ణ‌మ‌న‌కు బుట్ట‌బొమ్మ రేటెంతో తెలుసా?
X
టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గత కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్పటికీ ఈ అమ్మ‌డి జోరు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం పూజా హెగ్డే చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో 'జ‌న‌గ‌ణ‌మ‌న‌(జెజిఎమ్‌)' ఒక‌టి. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది.

ఇందులో రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్నాడు. పూరీ, విజ‌య్ కాంబోలో వ‌స్తోన్న రెండో చిత్ర‌మిది. ఇటీవ‌లె వీరుద్ద‌రూ 'లైగ‌ర్‌' చిత్రాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు 'జ‌న‌గ‌ణ‌మ‌న‌'ను ప్రారంభించారు. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి, ఛార్మీ కౌర్ సంయుక్తంగా పాన్ ఇండియాలో స్టాయిలో హై బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

శ‌నివారం ఉద‌యం ముంబైలో వేసిన భారీ సెట్ లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ను మేక‌ర్స్‌ షురూ చేశారు. ఫ‌స్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అయింది.

ఇప్పటివరకు గ్లామరస్‌గా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రల‌ను చేసి మెప్పించిన బుట్టబొమ్మ.. ఈసారి మాత్రం యాక్ష‌న్ రోల్ లో అల‌రించ‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం పూజా హెగ్డేపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను పూరీ షూట్ చేస్తున్నార‌ట‌.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి పూజా హెగ్డే అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌తి సినిమాకు రేటు పెంచుతున్న బుట్ట‌బొమ్మ‌.. 'జ‌న‌గ‌ణ‌మ‌న‌'కు సైతం అదే చేసింద‌ట‌. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల ప్ర‌కారం ఈ చిత్రానికి పూజా హెగ్డే 45 రోజులు డేట్స్ ఇచ్చింద‌ట‌. అందుకుగాను ఆమె రూ. 4.5 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌.

ఇక పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు సైతం ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో ఆమెకే తెలియాలి. కాగా, దేశభక్తి నేప‌థ్యంలో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్క‌తోన్న‌ ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్‌ 3న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో విజయ్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.