Begin typing your search above and press return to search.

షాకింగ్ః టిక్‌టాక్ భార్గ‌వ్ పై రేప్ కేసు.. బాలిక గ‌ర్భ‌వ‌తి?

By:  Tupaki Desk   |   20 April 2021 9:00 AM GMT
షాకింగ్ః టిక్‌టాక్ భార్గ‌వ్ పై రేప్ కేసు.. బాలిక గ‌ర్భ‌వ‌తి?
X
మాయమాట‌లు చెప్పి, ఓ బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేశాడంటూ.. టిక్ టాక్ ఫేమ్ భార్గ‌వ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఈ కేసులో అత‌న్ని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.. రేప్ కేసు కూడా న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

విశాఖ జిల్లా సింహ‌గిరికి చెందిన 14 సంవ‌త్స‌రాల బాలిక‌.. సోష‌ల్ మీడియాలో భార్గ‌వ్ కు ప‌రిచ‌యం అయిన‌ట్టు తెలిసింది. స‌ద‌రు బాలికకు సైతం టిక్ టాక్ వీడియోల‌పై ఇంట్ర‌స్ట్ ఉండ‌డంతో.. త‌ర‌చూ చాటింగ్ చేసుకునేవాళ్ల‌ట‌. అయితే.. ఆ బాలిక భార్గ‌వ్ ను అన్న‌య్య అని పిలిచేద‌ని తెలిసింది. కానీ.. డైలీ చాటింగ్ లో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యార‌ని, దీంతో.. భార్గ‌వ్ మాయ‌మాట‌లు చెప్పి, అమ్మాయిని లోబ‌రుచుకున్నాడ‌ని స‌మాచారం.

అయితే.. ఇటీవ‌ల స‌ద‌రు బాలిక ఆరోగ్యంలో తేడా రావ‌డంతో.. త‌ల్లిదండ్రులు ఆసుప‌త్రిలో చూపించార‌ని, దీంతో.. ఆమె గ‌ర్భ‌వ‌తి అని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో.. బాలిక త‌ల్లి ఈ నెల 16వ తేదీన పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో.. పోలీసులు భార్గ‌వ్ పై రేప్ కేసు న‌మోదు చేసి, అత‌న్ని అరెస్టు చేసినట్టు తెలిసింది.

అయితే.. ఇదంతా యాంక‌ర్ శివ త‌న ఇన్ స్టా అకౌంట్లో వెల్ల‌డించాడు. అత‌ను చెప్ప‌డంతో.. ప్రాంక్ చేస్తున్నాడ‌ని అనుమానిస్తున్నారు చాలా మంది. పాపులారిటీ కోసం నాట‌కాలు ఆడుతున్నార‌ని అంటున్నారు. కానీ.. ఇది వాస్త‌వ‌మేన‌ని అంటున్నాడు శివ‌. తాను వ్యూస్ కోసం ఈ మాట‌లు చెప్ప‌ట్లేద‌ని, ఈ వార్త‌ను బ‌య‌ట‌కు రాకుండా ఎక్క‌డ అడ్డుకుంటారోన‌ని తాను పోస్టు చేస్తున్న‌ట్టు చెప్పుకొచ్చాడు. మ‌రి, ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి