Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ అల‌ర్జీకి చికిత్స చేసినందుకు.. రూ.220 కోట్ల ఫైన్!

By:  Tupaki Desk   |   13 April 2021 11:30 PM GMT
హీరోయిన్‌ అల‌ర్జీకి చికిత్స చేసినందుకు.. రూ.220 కోట్ల ఫైన్!
X
అదేంటీ.. ట్రీట్మెంట్ చేసినందుకు ఆమె ఫీజు క‌దా చెల్లించాలి..? డాక్టర్లు ఫైన్ కట్టడమేంటీ..? అందులోనూ రూ.220 కోట్లా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయా? వీటికి సమాధానాలు తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

అమెరికాలోని లాస్ వేగాస్ కు చెందిన న‌టి, మోడ‌ల్‌ చెండెల్ ఇయాక‌లోన్‌. వ‌య‌సు 27 సంవ‌త్స‌రాలు. 2013లో పీన‌ట్ బ‌ట‌ర్ క‌లిపిన ఓ ఆహార ప‌దార్థాన్ని తిన్న‌ది. దీంతో.. వెంట‌నే తీవ్రంగా ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చింది. ఒళ్లంతా అల‌ర్జీతో బాధ‌ప‌డింది. వెంట‌నే లాస్ వేగాస్ లోని ‘అంబులెన్స్ స‌ర్వీస్‌’ అనే ఆసుప‌త్రి చికిత్స అందించింది.

అయితే.. ట్రీట్మెంట్ లో లోపం కార‌ణంగా స‌ద‌రు న‌టి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప‌రిస్థితి త‌లెత్తింద‌ట‌. దీంతో.. వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆమె కోర్టుకు ఎక్కారు. చికిత్స అందిస్తున్న స‌మ‌యంలో ఇయాక‌లోన్ మెద‌డుకు కొంత సేపు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింద‌ని ఆమె త‌ర‌పు లాయ‌ర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీని వ‌ల్ల తీవ్ర స‌మ‌స్య ఎదురైంద‌ని వాదించారు. అంతేకాకుండా.. చికిత్స‌కు అత్య‌వ‌స‌ర‌మైన మందులు కూడా వారి వ‌ద్ద లేకుండానే ట్రీట్మెంట్ కొన‌సాగించార‌ని కోర్టుకు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించారు. వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. బాధిత కుటుంబానికి ఏకంగా 29.5 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాల‌ని ఆదేశించింది.

భార‌త క‌రెన్సీ ప్ర‌కారం సుమారు రూ.220 కోట్లు. ఈ తీర్పు ప‌ట్ల బాధిత కుటుంబం ఆనందం వ్య‌క్తం చేసింది. ఇన్నాళ్లూ ప‌డిన మాన‌సిక వేద‌న‌కు ఫ‌లితం ద‌క్కింద‌ని, ఆసుప‌త్రి యాజ‌మాన్యం ఇక‌నైనా స‌రిగా ట్రీట్మెంట్ అందించాల‌ని సూచించింది.