Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ క్యారెక్టర్ పై షాకింగ్ న్యూస్..!

By:  Tupaki Desk   |   13 April 2021 4:03 AM GMT
స్టార్ హీరోయిన్ క్యారెక్టర్ పై షాకింగ్ న్యూస్..!
X
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా చివరిదశకు చేరడంతో ఆచార్య పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆచార్య సినిమా రూపొందిస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ సంయుక్తంగా ఆచార్యను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఎప్పుడైతే ఆచార్య అనే టైటిల్ బయటికి వచ్చిందో అప్పటినుండి సినిమా పై హైప్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆ మధ్య అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్స్ అన్ని ఒక్కసారిగా ప్రకటించి సర్ప్రైజ్ చేసారు ఆచార్య మేకర్స్. ఇప్పటికే ఆచార్య టీజర్, సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆచార్య సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ కీలకపాత్ర పోషించింది విదితమే.

సిద్ధ అనే పాత్రలో నటిస్తుండగా.. రాంచరణ్ జోడిగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే నటిస్తుంది. ఈ సినిమాలో పూజా ట్రైబల్ లేడీగా కనిపించనుంది. అయితే ప్రస్తుతం ఆచార్య సినిమాలో పూజా పాత్ర నిడివి గురించి పలు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటంటే.. ఈ సినిమాలో పూజాహెగ్డే పాత్ర కేవలం రెండు నిముషాలు మాత్రమే ఉండబోతుందని.. అలాగే రాంచరణ్ తో ఓ సాంగ్ వరకే పూజా క్యారెక్టర్ అంకితం అవుతుందని టాక్. అసలే పూజాహెగ్డే అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ కలిగిన హీరోయిన్. అలాంటిది ఆచార్యలో అంత చిన్న క్యారెక్టర్ చేయడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అమ్మడు ఓ పక్కన సల్మాన్, రన్వీర్, ప్రభాస్, దళపతి విజయ్ లతో సినిమాలు లైన్ లో పెట్టింది. మరి పూజా పాత్రపై క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.