Begin typing your search above and press return to search.

PSPK 27 .. టైటిల్ ఇదేనంటూ..!

By:  Tupaki Desk   |   13 Feb 2020 4:30 PM IST
PSPK 27 .. టైటిల్ ఇదేనంటూ..!
X
సినిమాల‌ స‌క్సెస్ లో టైటిల్ ఎంతటి కీల‌క పాత్ర పోషిస్తుందో చెప్పాల్సిన ప‌నే లేదు. మంచి కంటెంట్ కి త‌గ్గ‌ట్టే టైటిల్ స‌రిగ్గా కుదిరితే ఆ త‌ర‌హా సినిమాలపై పాజిటివిటీ పెరుగుతుంది. ప‌వ‌ర్ స్టార్ రీఎంట్రీ సినిమాల టైటిల్స్ ప్ర‌స్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. పీఎస్ పీకే 26 టైటిల్ లాయ‌ర్ సాబ్ - వ‌కీల్ సాబ్ అంటూ ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం అవుతోంది. ఇప్ప‌టికే PSPK 27 ని కూడా ప‌వ‌న్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఇంకా యూనిట్ అధికారికం గా టైటిల్ గురించి ఎలాంటి వివ‌ర‌మూ చెప్ప‌నే లేదు. ఈలోగానే ఈ సినిమా టైటిల్ ఇదీ అంటూ ఓ టైటిల్ వైర‌ల్ గా మారింది. ఎంచుకున్న కథానుసారం `విరూపాక్ష` అనేది ప‌వ‌న్ న‌టిస్తున్న 27వ సినిమా టైటిల్ అంటూ అభిమానులు ఇప్ప‌టికే వైర‌ల్ చేసేస్తున్నారు. `విరూపాక్ష` అంటే పరమ శివుని రూపం అని అర్థం. క్రిష్ చిత్రంలో ప‌వ‌న్ ఎంతో ఉగ్రుడిగా క‌నిపిస్తార‌ట‌. ధ‌నికుల్ని కొట్టి పేద‌ల‌కు పెట్టే రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం ఉంది. ఇప్ప‌టికే బంధిపోటు త‌ర‌హా లుక్ కి సంబంధించిన స్కెచ్ ఒక‌టి వైర‌ల్ అయ్యింది. అయితే విరూపాక్ష టైటిల్ కి ప‌వ‌న్ పాత్ర‌కు ఉన్న క‌నెక్టివిటీ ఏమిటి? అన్న‌ది క్రిష్ నే చెబుతారేమో చూడాలి. చారిత్రక నేపథ్యంలో బందిపోటు తరహా కథతో జానపద శైలిలో చిత్రాన్ని తెరకెక్కిస్తుండ‌డంతో ఇప్ప‌టికే ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రంలో కోహినూర్‌ వజ్రాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించే దొంగ పాత్ర‌లో పవన్‌ కనిపిస్తారని .. అందుకు సంబంధించిన కీలక సన్నివేశాలను క్రిష్‌ తెరకెక్కించార‌ని టాక్ న‌డుస్తోంది. కథానుగుణంగా విరూపాక్ష టైటిల్ సూట‌వుతుంద‌ని భావిస్తున్నారట. గమ్యం - కృష్ణంవందే జ‌గ‌ద్గురుం లాంటి తెలుగు భాష గౌర‌వాన్ని పెంచే టైటిల్స్ ని పెట్టుకున్నారు క్రిష్. ఇప్పుడు ప‌వ‌న్ కోసం మ‌రో తెలుగుద‌నం నిండిన టైటిల్ నే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే తాజా టైటిల్ ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట‌వుతుంది? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ప‌వ‌న్ చిత్రంలో కథానాయికగా సోనాక్షి- పూజా హెగ్డే- కియారా అద్వాణీ- వాణీ కపూర్‌- నిధి అగ‌ర్వాల్ .. అంటూ ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తున్నాయి. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉందింకా.