Begin typing your search above and press return to search.
విప్లవ హీరో నారాయణమూర్తి గురించి షాకింగ్ నిజాలు
By: Tupaki Desk | 15 May 2020 10:30 AM ISTఆయన తెరపై ఓ విప్లవ సేనాని.. ఆయన పేరు చెబితేనే ఓ ఉద్యమకారుడు గుర్తొస్తాడు. సామాజిక అంశాలపై మేలుకొలిపే సినిమాలు తీసే ఆర్. నారాయణ మూర్తి గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ. ఎర్రసైన్యం, చీమలదండు లాంటి బ్లాక్ బస్టర్ మూవీలు తీసి మావోయిస్టులపై పుట్టిక, ఉద్యమాన్ని ఎలుగెత్తి చాటారు నారాయణ మూర్తి. ఒకనొక సమయంలో స్టార్ హీరోగా వెలిగి కాలక్రమేణా ప్రజల అభిరుచి మారడంతో కనుమరుగై పోయారు. ఇప్పటికీ ఆయన వయసు 67 ఏళ్లు. ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు.. విప్లవ సినిమాలకే అంకితమయ్యాడు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..
*నారాయణ మూర్తి బాల్యం.. విద్యాభ్యాసం..
తుర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలోని ఒక పేదరైతు కుటుంబంలో నారాయణ మూర్తి డిసెంబర్ 31, 1953లో జన్మించారు. తల్లిదండ్రులు రెడ్డి చిన్నయ్య నాయుడు-చిట్టెమ్మ. వీరిది అతి సాధారణ రైతు కుటుంబం. రౌతులపూడి లో 5వ తరగతి వరకూ చదివాడు. రౌతుల పూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది.చిన్నతనం నుంచి సినిమాల్లో ఆసక్తితో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల సినిమాలు చూసి విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితానికి పునాది పడింది. శంఖవరంలో ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడే నారాయణ మూర్తికి సామాజిక సృహ కలిగింది. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి.. విప్లవ ఉద్యమాల వైపు ఆకర్సితుడయ్యాడు.
పెద్దాపురం లో బీ.ఏ చదవడానికి కాలేజీలో చేరాడు. అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై, సినిమాలు, రాజకీయాలు , సామాజిక బాధ్యత అనే మూడు వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరుచుకున్నాడు. కళాశాలలో ఈయన విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యాదర్శిగా ఎదిగాడు. ఉంటున్న హాస్టల్ విద్యార్థి అద్యక్షుడిగా.. పేద విద్యార్థుల నిధి సంఘాన్ని స్థాపించాడు.
ఇక భారత దేశంలో ఎమెర్జీన్సీ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున ఆయనను పోలీసులు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఇలాంటి సామాజిక అంశాలపై ప్రజలను మేలుకొల్పిందుకు నారాయణ మూర్తి సినిమాల్లో హీరో కావాలని నిర్ణయించుకున్నారు. సినిమా పిచ్చితోటి 1972లో మద్రాసు వెళ్లిపోయాడు. మనసులో ఉన్న సినిమా ఆశతో వేషాల కోసం తిరిగాడు. తిండి లేదు. వసతి లేదు. ఐనా ఏదో మూల ఆశ.. అక్కడక్కడా తింటూ లేనిరోజు పస్తులుంటూ.. రోడ్డు పక్కన చెట్టు కింద పడుకునేవాడు.
ఆ క్రమంలోనే దాసరి నారాయణ రావు గారి పరిచయంతో కృష్ణ సినిమా ‘నేరం-శిక్ష’లో నారాయణ మూర్తికి చిన్న పాత్ర నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయన ఒకడు. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్టు వేశాలు వచ్చాయి. ఆ తర్వాత దాసరిగారు మరోసారి నారాయణమూర్తికి అవకాశం ఇచ్చారు. ‘రమేశ్ బాబు’ హీరోగా ఆయన తీసిన నీడ చిత్రంలో నారాయణ మూర్తికి కీలక పాత్ర దక్కింది. సినిమా హిట్ కావడంతో నారాయణ మూర్తి నటనకు అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత అంచలెంచులుగా అవకాశాలు దక్కించుకొని విప్లవ సినిమాలతో తనకంటూ ముద్ర వేశాడు.
ఇక ఆ తర్వాత తనే నిర్మాతగా మారి తీసిన ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ గ్రాండ్ హిట్ అయ్యి నిర్మాతగా, దర్శకుడిగా నారాయణమూర్తికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో సామాజిక ఇతివృత్తాలపై మంచి చిత్రాలు తీశాడు. ‘‘ఎర్రసైన్యం’’ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత ‘‘చీమలదండు’’ లాంటి నక్సలైట్ ప్రధాన కథ సినిమాలతో స్టార్ హీరోగా కూడా నారాయణ మూర్తి ఎదిగారు.
2009 మార్చి వరకూ నారాయణ మూర్తి కథానాయకుడిగా నటించిన 26 సినిమాలలో 10 సినిమాలు విజయవంతమయ్యాయి. ఇక ఆ తర్వాత తీసిన సినిమాలు హిట్ కాకపోవడంతో సినిమాలకు దూరమయ్యారు.
నారాయణ మూర్తి ఇప్పటికీ జూబ్లీహిల్స్ వీధుల్లో ఆటల్లో తిరుగుతుంటారు. ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడుపుతారు. పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నిస్తే అదంత చర్చించదగ్గ విషయం కాదని దాటేవేస్తాడు. ‘తన జీవిత భాగస్వామి తన ప్రజా జీవితానికి ఎక్కడ అడ్డు వస్తుందో అనే అనుమానంతో పెళ్లి చేసుకోలేదట.. సినీ దర్శకనిర్మాతగా ఎన్నో సినిమాలను తీసి , నటించి ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఈయనకు ఇప్పటికీ సొంత ఇళ్లు లేదు. సొంత కారు కానీ లేవు. ఈయనకు తెలుగు దేశం పార్టీ రెండు సార్లు కాకినాడ లోక్ సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశం లేదంటూ తిరస్కరించాడు.
దర్శకుడు పూరి జగన్నాథ్ ‘టెంపర్’ సినిమాలో పోసాని పోషించిన పాత్ర ఇవ్వజూపి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా కమర్షియల్ చిత్రాల్లో నటించనని నారాయణమూర్తి ఈ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేయడం విశేషం. ఇన్ని ఏళ్లు వచ్చినా తన పంథా మారదని.. డబ్బు కంటే విలువలే తనకు ముఖ్యమని నిరూపించిన నారాయణమూర్తి లాంటి వ్యక్తులు సినీ ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారనే చెప్పవచ్చు..