Begin typing your search above and press return to search.

కలెక్షన్ కింగ్ కి జోడీగానే కాదు తల్లిగానూ చేసిన నటి!

By:  Tupaki Desk   |   31 March 2021 11:30 PM GMT
కలెక్షన్ కింగ్ కి జోడీగానే కాదు తల్లిగానూ చేసిన నటి!
X
తెలుగు తెరపై నిర్మలమ్మ తరువాత 'అమ్మ' పాత్రలకు .. 'బామ్మ' పాత్రలకు అంతటి నిండుతనాన్ని తీసుకొచ్చిన ఆరిస్ట్ గా అన్నపూర్ణమ్మ కనిపిస్తుంది. నిర్మలమ్మ వాయిస్ లో .. నటనలో ఎంతటి సహజత్వం ఉంటుందో, అన్నపూర్ణమ్మ వాయిస్ లోను .. నటనలోను అంతే ప్రత్యేకత ఉంటుంది. ఒక సన్నివేశంలో వాళ్ల చుట్టూ ఎంతటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ తేలిపోవలసిందే. అంతటి కాన్ఫిడెంట్ గా అన్నపూర్ణమ్మ నటిస్తుంది. అందుకే తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆమె నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూనే వస్తోంది. తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో ఆమెను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

"సావిత్రమ్మ .. నిర్మలమ్మ .. అన్నపూర్ణమ్మ అని పిలిపించుకోవడం ఈ పరిశ్రమలో వాళ్లు పొందిన గౌరవాన్ని సూచిస్తుంది. కొంతమంది ఆర్టిస్టుల పేరుకు 'గారు' చేర్చి పిలుస్తుంటారు. శారదగారు .. సుజాత గారు .. లక్ష్మీగారు .. ఇలా. గారు చేర్చి పిలిచేది గౌరవం .. అమ్మను చేర్చి పిలిచేది ఆత్మీయత. అలా 'అమ్మ' అని ఆత్మీయంగా పిలిపించుకున్న అతికొద్ది మందిలో అన్నపూర్ణమ్మ ఒకరుగా కనిపిస్తుంది. ఆమెను మొదటిసారిగా నేను 'స్వర్గం నరకం' సినిమాలో మోహన్ బాబు గారి సరసన చూశాను. విచిత్రమేమిటంటే అదే అన్నపూర్ణమ్మకు 'అసెంబ్లీరౌడీ'లో మోహన్ బాబుగారికి తల్లి పాత్రను రాశాము. విశేషమేమిటంటే అటు ఆ సినిమా ఆడింది .. ఇటు ఈ సినిమా ఆడింది. ఇంకొంతకాలం పోతే ఆరిస్టుగా గోల్డెన్ జూబిలీ జరుపుకునే గొప్ప ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ.

'అనురాగదేవత' సినిమాలో ఆమె ఎన్టీఆర్ గారికి 'అమ్మ' పాత్రను చేసింది. అప్పటికి ఆమె చాలా చిన్న అమ్మాయిగానే ఉండేది. అదే విషయాన్ని నేను అన్నగారితో అన్నాను కూడా. "సినిమా బాగుంటే ఇలాంటావేం పట్టించుకోరు .. చూసుకుంటూ వెళ్లిపోతారు" అని ఆయన అన్నారు. 'ముందడుగు' సినిమాలో ఆమె కృష్ణగారికి తల్లిపాత్రను చేసింది. ఆమె వయసు చాలా చిన్నదనే విషయంపై రామానాయుడుగారు కూడా ఆలోచనలో పడ్డారు. ఎన్టీఆర్ గారికి తల్లిగా చేసిన ఆమె, కృష్ణగారికి తల్లిగా చేస్తే తప్పేంటని అడిగాను. కానీ ఆయనలో ఆ సందేహం ఉంటూనే ఉంది. ఆ సినిమాలోని తల్లిపాత్ర ఆమెకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. 4వ వారంలో ఆమె పాత్ర ప్రధానంగా పెద్ద పోస్టర్ ను రిలీజ్ చేయడం విశేషం" అని చెప్పుకొచ్చారు.