Begin typing your search above and press return to search.

డిస్ట్రిబ్యూట‌ర్ల విష‌యంలో కొర‌టాల షాకింగ్ నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   4 May 2022 9:00 AM IST
డిస్ట్రిబ్యూట‌ర్ల విష‌యంలో కొర‌టాల షాకింగ్ నిర్ణ‌యం
X
భారీ చిత్రాల‌కు డిస్ట్రి బ్యూట‌ర్లు పోటీప‌డి మ‌రీ భారీ మోత్తాల్ని వెచ్చించ‌డం ఫ‌లితం తారుమారైతే భారీ న‌ష్టాల‌ని చ‌విచూడ‌టం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన క్రేజీ మూవీ `ఆచార్య` కూడా ఇదే త‌ర‌హాలో భారీ స్థాయిలో న‌ష్టాల‌ని చవిచూస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించారు. చిరు నుంచి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

పైగా `ట్రిపుల్ ఆర్` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత చ‌ర‌ణ్ న‌టించిన సినిమా కావ‌డంతో `ఆచార్య‌`ని మెగా అభిమానులు చాలా ప్ర‌త్యేకంగా చూశారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఫ‌స్ట్ షో నుంచి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరుత్సాహ ప‌రిచింది. దీంతో ఈ సినిమాని భారీ మొత్తానికి సొంతం చేసుకుని రిలీజ్ చేసిన‌ డిస్ట్రిబ్యూట‌ర్లు భారీ స్థాయిలో న‌ష్టాల‌ని చివి చూస్తున్నారు.

ఒక భారీ చిత్రం తీవ్ర న‌ష్టాల‌ని క‌లిగిస్తే హీరో, డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఎంతో కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వ‌డం అనే సంప్ర‌దాయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వుంది. ఇప్ప‌డు అదే సంప్ర‌దాయాన్ని `ఆచార్య‌` టీమ్ పాటిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా బ‌య్య‌ర్ల‌కు 60 శాతం న‌ష్టాల‌ని మిగిల్చింది. ఈ మండేతో సినిమా డిజాస్ట‌ర్ గా తేల‌డంతో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ బ‌య్య‌ర్ల‌ని కాపాడేందుకు రంగంలోకి దిగారు.

ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మ రెమ్యున‌రేష‌న్ లోంచి 10 కోట్ల‌ని తిరిగి ఇచ్చేశార‌ట‌. ఇక కొర‌టాల శివ ఇది త‌న స్నేహితుడు నిరంజ‌న్ రెడ్డి నిర్మించిన సినిమా కావ‌డంతో బిజినెస్ వ్య‌వ‌హారాలు ఆయ‌నే స్వ‌యంగా చూసుకున్నార‌ట‌. ఆ కార‌ణంగా మిగ‌తా లాస్ ని తానే భ‌రించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నిర్మాత నిరంజ‌న్ రెడ్డి కూడా త‌న‌కొచ్చిన మొత్తంలో కొంత అమౌంట్ ని బ‌య్య‌ర్స్ కి తిరిగి ఇచ్చేశార‌ట‌.

ఇక పైన‌ల్ గా త‌న వ‌ద్ద నుంచి వెళ్లాల్సిన‌ అమౌంట్ కొర‌టాల శివ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు అందించ‌బోతున్నాడ‌ని చెబుతున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30 వ సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌డానికి ముందే `ఆచార్య‌` కార‌ణంగా న‌ష్ట‌పోయిన బ‌య్య‌ర్ల‌కు కొంత మొత్తాన్ని కొర‌టాల శివ తిరిగి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఎందుకంటే ఎన్టీఆర్ 30కి ఎటాంటి ఫైనాన్షియ‌ల్ అడ్డంకులు వుండ‌కూడ‌ద‌ని ఇప్పుడే క్లియ‌ర్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందుకే అన్నీ సెటిల్ చేశాకే ఎన్టీఆర్ 30 వ సినిమాని ప్రారంభించబోతున్నార‌ని తెలిసింది.