Begin typing your search above and press return to search.

ఫోటోషూట్లు సోష‌ల్ మీడియాలే ఇంత చేశాయంది!

By:  Tupaki Desk   |   12 Jan 2022 5:30 AM GMT
ఫోటోషూట్లు సోష‌ల్ మీడియాలే ఇంత చేశాయంది!
X
న‌ట‌వార‌సురాలు కాకపోయినా కానీ నేహాశ‌ర్మ నెమ్మదిగా నెప్టో ప‌రిశ్ర‌మ బాలీవుడ్ లో త‌న కెరీర్ ని మ‌లుచుకుంటున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఆల‌స్య‌మైనా కానీ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుని చెల్లెలిలా శ‌ర్మా గాళ్ ప‌ట్టుద‌ల‌గా ముందుకు సాగుతోంది. త‌న అనుభ‌వాల గురించి చెబుతూ.. ఒకానొక సంద‌ర్భంలో స్టార్ కిడ్స్ గురించి ప్ర‌స్థావించింది నేహా. న‌ట‌వార‌సుల‌తో పోలిస్తే బాలీవుడ్ ప్రపంచాన్ని అన్వేషిస్తున్నప్పుడు బయటి వ్యక్తులు తమంతట తాముగా ఎదుగుతున్నారని నటి నేహా శర్మ భావించారు. త‌న‌లాంటి వారికి కూడా పరిశ్రమ మొత్తం మద్దతు ఉంది.

బాలీవుడ్ లో ప్రయాణం ప్రారంభించి 10 ఏళ్లు దాటింది. నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే.. ప్రతి రోజు ఒక కొత్త వ్యక్తి లేదా వ్యక్తిని క‌లుస్తూ వెళుతుంటాం గ‌నుక మ‌న‌ల్ని ఎవ‌రూ మరచిపోకుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి అని శ‌ర్మా అంది.

న‌ట‌వార‌సుల‌కు మొత్తం పరిశ్రమ మద్దతు ఉంది. మీరు ఇండస్ట్రీ కిడ్ అయితే సోదరభావం తో ఆఫ‌ర్లు అందుకుంటారు. కాబట్టి బయటి వ్యక్తి గా మీరు జీవించగలిగే ఏకైక మార్గం అంద‌రితో మంచి సంబంధాల‌ను క‌లిగి ఉండ‌డ‌మే.. అని నేహా శ‌ర్మ తెలిపింది.

2010లో క్రూక్‌తో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియా ఔత్సాహికులకు వ‌రుస ఫోటోషూట్ల‌తో నిరంత‌రం ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. నేహాశ‌ర్మ అలా సోఫా సెట్స్ పై బ్లాక్ డ్రెస్ లో ఇన్న‌ర్ అందాల్ని ఆర‌బోసిన తీరు వేడెక్కిస్తోంది.

``నేను న‌టిగా కెరీర్ ప్రారంభించినప్పుడు సోషల్ మీడియా ఒక గొప్ప‌ విషయం కాదు. ఇప్పుడు నేను పరిశ్రమలోకి వస్తున్న వ్యక్తులను చూసినప్పుడు ఇది చాలా సులభ మార్గం అనిపించింది... పరిశ్రమకు చెందిన వారు కాని ఈ ప్రభావశీలులందరినీ చూడండి. వారికి అంతర్గత సంబంధాలు లేవు. కానీ వారు అనుకున్న‌ది చేసేస్తున్నారు అని నేహా శ‌ర్మ తెలిపింది. తన కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే,.. “నాకు ఇది లేదా అది ఎందుకు లభించడం లేదని నేను భావించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈ రోజు ఉన్న స్థితిలో ఉండటానికి నాకు 10 సుదీర్ఘ సంవత్సరాలు పట్టింది. నేను చేయాలనుకున్న పాత్రలు నాకు లభించకపోవడంతో చాలా కాలం విరామం తీసుకున్నాను. కానీ నేను ఇప్పటికీ చక్క‌ని సంబంధాల్ని కొన‌సాగించాల్సి వచ్చింది. ప్రజల మనస్సులలో ఉండేలా పనులు చేయాలి. కాబట్టి నాకు వచ్చిన ఆఫర్ లు నిల‌బెట్టుకునేందుకు నేను నమ్మని పనులను నేను చేసిన దశలు ఉన్నాయి. ఇప్పుడు OTT ప్లాట్ ఫారమ్ లు రావడంతో నాకు చాలా మంచి పని దొరికింద‌ని భావిస్తున్నాను..ఇప్పుడు ఓటీటీలు కొత్త టాలెంట్ ను తయారు చేయడమే కాకుండా.. వారంద‌రికీ సినిమాల ఆఫ‌ర్లు వ‌చ్చేలా చేస్తున్నాయి. ఎందుకంటే వారు తమ అభిమానులతో కనెక్ట్ అయ్యారు అప్ప‌టికే. ప్రజలు వారిని చూడాలనుకుంటున్నారు. కాబట్టి పరిశ్రమ కూడా దానిని స‌ద్వినియోగం చేస్తుంది... అంటూ త‌న నాలెజ్ ని ప్ర‌ద‌ర్శించింది. అన్న‌ట్టు శ‌ర్మాగాళ్ త‌దుప‌రి భారీ చిత్రాల‌తో అభిమానుల ముందుకు రానుంది. ఇటీవ‌ల ఇల్లీగ‌ల్ జ‌స్టిస్ సిరీస్ తో నేహాశ‌ర్మ‌కు మంచి పేరొచ్చింది. తానాజీలోనూ చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.