Begin typing your search above and press return to search.

షాకిస్తున్న అన‌సూయ `స్పెష‌ల్` పారితోషికం..!

By:  Tupaki Desk   |   14 March 2021 5:30 AM GMT
షాకిస్తున్న అన‌సూయ `స్పెష‌ల్` పారితోషికం..!
X
``ఐటమ్ నంబ‌ర్ కాదు.. స్పెష‌ల్ నంబ‌ర్ అని పిల‌వాల‌మ్మా..!`` అంటూ క్లాస్ తీస్కున్నారు మేటి యాంక‌ర్ కం న‌టి అన‌సూయ‌. కార్తికేయ హీరోగా నటిస్తున్న `చావు క‌బురు చ‌ల్ల‌గా` చిత్రంలో అన‌సూయ స్పెషల్ రోల్ గురించి తెలిసిందే.

ఇంత‌కుముందు రిలీజైన స్పెష‌ల్ సాంగ్ లిరిక్ .. నృత్యాల్ని చూశాక అంతా ఐట‌మ్ నంబ‌ర్ లో చెల‌రేగిన అన‌సూయ! అంటూ వ్యాఖ్యానించారు. కానీ దానికి రంగ‌మ్మ‌త్త‌ ఎట్టిప‌రిస్థితిలో అంగీక‌రించ‌ని సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా ఇప్పుడు ఆ స్పెష‌ల్ నంబ‌ర్ ఇండ‌స్ట్రీ స‌హా అన‌సూయ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. చావుక‌బురు.. కి ఈ పాట అద‌న‌పు అస్సెట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

3 నిమిషాల నిడివి ఉండే ఈ సాంగ్‌ కోసం అనసూయ ఎంత పారితోషికం అందుకుంటున్నారు? అన్న‌ది ఆరా తీస్తే.. అక్షరాలా రూ .20 లక్షలు డిమాండ్ చేశార‌ని.. సుమారు 15ల‌క్ష‌ల వ‌ర‌కూ చెల్లించే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ మేర‌కు జీఏ2 బ్యాన‌ర్ తో అన‌సూయ ఒప్పందం కుదుర్చుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

కార్తికేయ-లావణ్య త్రిపాఠి నాయ‌కానాయిక‌లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అన‌సూయ ప్ర‌స్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రంగ మార్తాండ`.. రవితేజ హీరోగా వస్తోన్న `కిలాడి`లోనూ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. తమిళంలోనూ విజయ్ సేతుపతి సినిమాలోనూ అన‌సూయ న‌టిస్తున్నారు.