Begin typing your search above and press return to search.

​బాహుబలి ఎలాంటి డొనేషన్ చేయలేదు

By:  Tupaki Desk   |   12 May 2017 9:40 AM GMT
​బాహుబలి ఎలాంటి డొనేషన్ చేయలేదు
X
బాహుబలి విడుదలైంది సినిమా హిస్టరిలో ఒక గొప్ప మైలురాయిగా మారింది. ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం తన విజయకేతనం ఎగరవేసింది. అందరూ ఆ ఆనందాన్ని ఆస్వాదించారు. రాజమౌళికి ఈ సినిమాతో ఇండియా గర్వించదగ్గ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ప్రభాస్ ఇండియా లో ఒక స్టార్ గా అవతరించాడు. రమ్యకృష్ణ కి ఒక గొప్ప రాజమాత గా గుర్తింపు పొందింది. కాకపోతే ఇప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డకు కొత్త తలపోటు వచ్చింది.

1000 కోట్లు అంటే ఏమిటో తెలియని నిర్మాతను నేను. నాకు ఇప్పుడు ఆ ఆనందం బాగుంది. నేను ఇది ఎప్పుడు కలలో కూడా అనుకోని ఒక గొప్ప నిజం అని చెప్పుతూ నాకు ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే వార్త చాలా చిరాకు పుట్టిస్తుంది అని అన్నారు. కొంత మంది పనిలేక మా సక్సెస్ చూసి అసూయపడి మేము (బాహుబలి టీమ్ ) బాహుబలి సినిమా కలెక్షన్లో మొదటి రోజు వచ్చే ప్రాఫిట్ మన ఇండియన్ ఆర్మీ కి డొనేట్ చేస్తామని పుకారులు పుట్టించారు. ఇది చాలా గొప్ప పనే కానీ మాకు సంభందం లేని నిర్ణయాలు మేము ఎలా నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.

బాహుబలి లాంటి సినిమా మళ్ళీ తీయాలంటే అది ఇప్పటిలో జరిగే పని కాదు. ఏమో కథ కుదిరితే బాహుబలి 3 సినిమా తీసే అవకాశం ఉంటుందేమో కదా అని చెపుతూ అటువంటి డొనేషన్ ఏమి మేము చేయటం లేదు అని చెప్పారు. ఇటువంటి పుకార్లు వలన బాహుబలి జోరుకి అడ్డుకట్టు వేయాలి అని వాళ్ళ ఆలోచన కాబోలు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మన ఇండియాలోనే చూస్తాం కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/