Begin typing your search above and press return to search.

ఇది నాలుగున్నరేళ్ల మార్కెటింగ్!!

By:  Tupaki Desk   |   3 May 2017 4:37 AM GMT
ఇది నాలుగున్నరేళ్ల మార్కెటింగ్!!
X
బాహుబలి ది కంక్లూజన్.. ఇప్పుడు ఇన్నేసి సంచలనాలకు వేదిక అవుతోంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభమై ఆరేళ్లు కాగా.. షూటింగ్ మొదలయ్యాకే నాలుగున్నరేళ్లు గడించింది. ఇంత కాలం పాటు ఒక్క సినిమా గురించి జనాల ఏ దశలోనూ మరిచిపోకుండా ఉండేలా చేయడం చిన్న విషయమేమీ కాదు. దీని వెనక ఎంతో కృషి.. మరెన్నో పబ్లిసిటీ జిమ్మిక్స్ దాగున్నాయి.

ఈ చిత్రానికి పబ్లిసిటీ యాక్టివిటీస్ కోసం కొన్ని కంపెనీలను సంప్రదించారు శోభు యార్లగడ్డ. వేటికీ సంతృప్తి చెందని ఆయన.. చివకు ఆర్కా కనెక్ట్ పేరుతో 25 మంది టీంను తనే ఏర్పాటు చేసుకుని.. బాహుబలి ప్రచార కార్యక్రమాల కోసమే ఈ నాలుగున్నరేళ్ల పాటు వినియోగించారు. ఇక బుక్స్.. గేమ్స్.. యానిమేటెడ్ సిరీస్.. వీఆర్ ట్రైలర్స్.. ఇలాంటి ఎన్నో భిన్నమైన ప్లాట్ ఫామ్స్ పై బాహుబలి కనిపించింది.. వినిపించింది. 'ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉన్నాం. ఏ అవకాశాన్ని వదలిపెట్టలేదు. ఇదేమీ కొన్ని రోజుల్లోనో.. కొన్ని నెలల్లోనో సాధించిన విషయం కాదు' అని చెప్పారు శోభు.

'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఎక్కువగా వర్కవుట్ అయింది. ట్రైలర్ తర్వాత ఈ మూవీకి హైప్ ఎక్కువయింది. కానీ అక్కడి వరకూ సినిమాపై ఆసక్తిని నిలపడమే కష్టమైన విషయం. ఎన్ని చేసినా నా ప్రయత్నాలు మొదటి రోజున థియేటర్లకు తీసుకురావడం వరకే ఉంటుంది. ఆ తర్వాత సినిమానే మిగిలిన పని చేయాలి. అదే జరిగింది' అన్నారు శోభు యార్లగడ్డ. ఈ స్థాయిలో ఓ సినిమాకి ప్రచారం దక్కేలా చేయడం.. ఇప్పట్లో మరెవరికీ సాధ్యమయ్యే విషయం కాదని అనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/