Begin typing your search above and press return to search.

ఇక పై సినిమా ఈవెంట్స్ బంద్: ప్రముఖ నిర్మాత

By:  Tupaki Desk   |   19 May 2020 12:30 PM GMT
ఇక పై సినిమా ఈవెంట్స్ బంద్: ప్రముఖ నిర్మాత
X
కరోనా కారణంగా జీవితంలోనే కాదు జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఈ కరోనా ప్రభావం దేశంలోని అన్నీ వ్యాపార రంగాలను, పరిశ్రమలతో పాటు సినీ ఇండస్ట్రీపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీని కారణంగానే సినిమా షూటింగ్స్ ఆపేసి.. విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ముఖ్యంగా అన్నింటికంటే ముందు సినిమా థియేటర్లను మూసివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా నష్టాల బారిన పడ్డారు. ఇక కరోనా పరిస్థితుల పై రాబోయే సినిమా రిలీజ్ ఈవెంట్ లపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. కరోనా ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ మన అదృష్టం బాగుండి కరోనా ముగిస్తే.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో గతంలోని పరిస్థితులు, ఫిల్మ్‌ మార్కెటింగ్‌ కుదరదని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఆయన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు. ‘కొవిడ్‌ తర్వాత ఫిల్మ్‌ మార్కెటింగ్‌ ఎలా ఉండబోతోంది, ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెటింగ్‌ ఎలా మారుతుందో అని ఆశ్చర్యపోతున్నా. ప్రీ-రిలీజ్‌ వేడుకలు, ఆడియో విడుదల కార్యక్రమాలు, థియేటర్స్‌, మాల్స్‌కు వెళ్లడం, రోడ్‌ ట్రిప్‌లు.. ఇలాంటివి ఇకపై ఉండవు. సినిమా కార్యక్రమాలను నిర్వహించడం కుదరదు. డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వంటి భారీ హిట్ల తర్వాత శోభూ యార్లగడ్డ నిర్మిస్తున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. ఈ సినిమాలో సత్యదేవ్‌ హీరోగా నటించగా.. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించాడు. ఓ సూపర్ హిట్ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌ ఇది. ప్రస్తుతం ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.