Begin typing your search above and press return to search.

బాహుబలిపై విసుగొచ్చిందా రానా?

By:  Tupaki Desk   |   14 Dec 2015 9:40 AM GMT
బాహుబలిపై విసుగొచ్చిందా రానా?
X
డిసెంబర్ 14 భల్లాలదేవుడైన దగ్గుబాటి రాణా పుట్టిన రోజు. ఈ మూవీతో రాణాకి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలుసు. ఇప్పటివరకూ చూసింది కొంతేనని, అసలు భల్లాలదేవుడి విశ్వరూపం రెండో భాగంలో చూడబోతున్నామనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బాహుబలి సీక్వెల్ షూటింగ్ మొదలైంది.

ఈ సమయంలోనే రాణా బర్త్ డే చేసుకుంటుండడంతో.. నిర్మాతల్లో ఒకరైన శోభ యార్గగడ్డ విషెస్ చెబ్తూ ట్వీట్ చేశారు. "బాహుబలిలో భాగంగా ఇది రాణాకు మూడో పుట్టిన రోజు. మాతో కలిసి మరిన్ని పుట్టిన రోజులు చేసుకోవాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన రాణా.. "థ్యాంక్యూ వెరీ మచ్ - కానీ ఇదే సెట్స్ పై జరిగే పుట్టిన రోజులు ఇక ఆగిపోతే మంచిదేమో? ఏమంటారు?" అంటూ ట్వీట్ చేశాడు. దీంతో బాహుబలి మూవీ చేసీచేసీ రాణాకి విసుగొచ్చేసింది అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇలా ఒకే సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డం, ఎప్పుడూ కండలు పెంచుకుంటూ ఫిట్ గా ఉండాల్సి రావడం, ఇంతటి భారీ దేహంతో వేరే సినిమాలు చేసే అవకాశం లేకపోవడం.. రాణాకు విసుగు తెప్పించిన కారణాలు కావచ్చు.

అయితే.. ఈ బర్త్ డేతో దగ్గుబాటి రాణా 33 ఏళ్ల వయసు కంప్లీట్ చేసుకోనున్నాడు. ఇక చాలు అంటున్నాడు కానీ.. వచ్చే పుట్టిన రోజు కూడా.. ఇదే టీంతో కలిసి చేసుకోక తప్పదు. ఎందుకంటే.. అప్పటికి రిలీజ్ కి రెడీగా ఉంటుంది "బాహుబలి ది కంక్లూజన్."‘