Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడి వార‌సుడు సైజ్ మ్యాట‌ర్ క‌థేమిటో..!

By:  Tupaki Desk   |   9 March 2021 3:46 AM GMT
ద‌ర్శ‌కుడి వార‌సుడు సైజ్ మ్యాట‌ర్ క‌థేమిటో..!
X
ప్ర‌భాస్ కి `వ‌ర్షం` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని ఇచ్చారు ద‌ర్శ‌కుడు శోభ‌న్. ఆయ‌న అకాల‌మ‌ర‌ణం తెలిసిందే. స్వ‌ర్గీయ‌ శోభ‌న్ వార‌సుడు సంతోష్ శోభ‌న్ ప్ర‌స్తుతం హీరోగా రాణించేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇంత‌కుముందు `పేప‌ర్ బోయ్` అనే విల‌క్ష‌ణ‌మైన కాన్సెప్ట్ ఉన్న సినిమాతో న‌టుడిగా మెప్పించారు. `త‌ను నేను` అనే చిత్రంలోనూ సంతోష్ న‌టించారు.

తాజాగా సంతోష్ క‌థానాయ‌కుడిగా యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ‌ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి `ఏక్ మినీ కథ` పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రీప్రొడ‌క్ష‌న్ స్వింగ్ లో ఉంది. మేర్ల‌పాక గాంధీ స్క్రిప్ట్ అందిస్తుండ‌గా.. కార్తీక్ రాపోలు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తు‌న్నారు. ఇందులో `ఈ మాయ పేరేమిటో?` ఫేమ్ కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రద్ధాదాస్- బ్రహ్మాజీ ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

డజ్ సైజ్ మేటర్? అనే ఫ‌న్నీ క్యాప్షన్ తోనే చిత్ర‌బృందం క్యూరియాసిటీ పెంచింది. ఇంత‌కుముందే కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని రివీల్ చేశారు. ఇప్పుడు శోభ‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌గా ఆస‌క్తిని క‌లిగించింది. ఇది యువ‌త‌రాన్ని టార్గెట్ చేసిన ఫ‌న్నీ ఎంట‌ర్ టైన‌ర్ అని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.