Begin typing your search above and press return to search.

ఇండో-పాక్ లవ్.. అదిరిందిగా..

By:  Tupaki Desk   |   16 March 2016 9:51 AM GMT
ఇండో-పాక్ లవ్.. అదిరిందిగా..
X
ఇండియా-పాకిస్తాన్.. ఈ రెండు దేశాలు ఏ అంశంపై ఒక చోటకు చేరినా అదో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగడంతో.. రెండు దేశాల మధ్య ఆసక్తి తారాస్థాయికి చేరిపోయింది. ఏ చిన్న టాపిక్ అయినా ట్రెండింగ్ అయిపోతోంది. ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకునేందుకు ఓ ప్రముఖ టీ పొడి తయారు చేసే సంస్థ యాడ్ రూపొందించింది.

భారతీయ యువతి టెన్నిస్ సంచలనం సానియా మీర్జా-పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు కలిసి నటించడం విశేషం. రియల్ లైఫ్ లో భార్యా భర్తలైన వీరిద్దరితో యాడ్ రూపొందించడమే కాదు.. దాన్ని విభిన్నంగా డిజైన్ చేసి, ఇద్దరి మధ్య ఉన్న టేస్ట్ లలో తేడాలను ప్రస్తావించింది. ప్రతీ విషయంలోనూ వాదులాడుకుంటూ ఉంటారు వీరు. సచిన్ స్ట్రైడ్ డ్రైవ్ సూపర్ అని సానియా అంటే, షోయబ్ అక్తర్ వేసే యార్కర్ కి ఓటేస్తాడు షోయబ్. ముల్తాన్ సోనా హల్వా బాగుంటుందని షోయబ్ చెబ్తే.. అమృత్ సర్ లడ్డూకి వేరేదేదీ సాటి లేదని సానియా అంటుంది.

బాలీవుడ్ పాత పాటలు సానియా మీర్జా అంటే.. పాకిస్తాన్ పాప్ సాంగ్స్ అదుర్స్ అంటున్నాడు షోయబ్. కానీ ఇద్దరూ మాత్రం ఓ బ్రాండ్ టీ దగ్గరకు వచ్చేసరికి కలిసిపోతారు. కాన్సెప్టే కాదు.. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ యాడ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.