Begin typing your search above and press return to search.

ఆ నటిని ప్రేమించా -పాక్ బౌలర్

By:  Tupaki Desk   |   28 Dec 2017 11:30 PM GMT
ఆ నటిని ప్రేమించా -పాక్ బౌలర్
X
క్రికెట్ గ్రౌండ్ కి వెండి తెరకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ రంగంలో ఉండేవారికి తెలియని పరిచయాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా ఆటగాళ్లకు నటీమణులకు రిలేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ తరువాత ప్రేమ వరకు వెళ్లవచ్చు లేకుంటే పెళ్లి పీటల వరకు కూడా రావచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఓ క్రికెటర్ బాలీవుడ్ నటిపై మనసుపడి తన ప్రేమను చెప్పాలని అనుకున్నాడట. అంతే కాకుండా ఆమెను కిడ్నాప్ కూడా చెయ్యాలని అనుకుంటున్నాడట. ఇంతకీ అతను ఎవరో అనుకుంటున్నారా? దాయాది దేశమైన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. షోయబ్ అక్తర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే పై అప్పట్లో మనసు పారేసుకున్నాడట. వన్ సైడ్ లవ్ తో కొన్నేళ్ల వరకు ఓపిక పట్టిన ఈ ప్లేయర్ ఫైనల్ గా ఆమెను కలుసుకోవాలని ఒక రోజు మేనేజ్ మెంట్ అనుమతి తీసుకున్నాడు. కలిసిన వెంటనే ఎలాగైనా తన ప్రేమను అందంగా చెప్పి ఒకే చేయించాలని అనుకున్నాడు. ఇక ఆమె తన ప్రేమను రిజెక్ట్ చేస్తే కిడ్నాప్ చేసేందుకు కూడా అక్తర్ ప్లాన్ వేసుకున్నాడట. అయితే చివరికి ఏం జరిగిందో తెలియదు గాని..నా ప్రేమ సంగతి దేవుడెరుగు కానీ కనీసం ఆమెను కలవడం కూడా కుదరలేదని షోయబ్ అక్తర్ చెప్పాడు.

తెలుగులో మురారి.. ఇంద్ర.. ఖడ్గం.. శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి సినిమాల్లో నటించిన మరాఠి భామ సోనాలి బింద్రే.. నిర్మాత గోల్డీ బెహల్ ను ప్రేమించి పెళ్ళాడిన సంగతి తెలిసిందే.