Begin typing your search above and press return to search.

నాన్న ఏదైతే ఫాలో అయ్యారో ఆ దారిలోనే నేను

By:  Tupaki Desk   |   7 July 2019 4:32 AM GMT
నాన్న ఏదైతే ఫాలో అయ్యారో ఆ దారిలోనే నేను
X
జీవిత రాజశేఖర్‌ ల పెద్దమ్మాయి శివానీ హీరోయిన్‌ గా పరిచయం కాబోతుంది అంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. అన్నట్లుగానే శివానీ హీరోయిన్‌ గా సినిమా ప్రారంభం అయ్యింది. కాని దురదృష్టవశాత్తు ఆ సినిమా ఆగిపోయింది. అయితే అక్కకంటే ముందు చిన్నమ్మాయి శివాత్మిక ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. జీవిత రాజశేఖర్‌ ల చిన్న కూతురు అయిన శివాత్మిక 'దొరసాని' చిత్రంతో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి శివాత్మిక నటించిన 'దొరసాని' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా శివాత్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను షేర్‌ చేసుకుంది.

శివాత్మిక మాట్లాడుతూ.. నా చిన్నప్పటి నుండి షూటింగ్స్‌ చూస్తూనే ఉన్నాను. స్కూల్‌ కంటే షూటింగ్స్‌ కు ఎక్కువగా వెళ్లి ఉంటాను. అందుకే నేను హీరోయిన్‌ అవుతానంటే ఇంట్లో వారు షాక్‌ అవ్వలేదు. ఈ సినిమా కథను దర్శకుడు మహేంద్ర చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. నా పాత్ర చాలా భిన్నంగా హుందాగా ఉండటంతో చాలా ఆసక్తి పెంచుకున్నారు. కథ నాలుగు గంటలు చెప్పిన తర్వాత తప్పకుండా ఈ సినిమా చేయాలనిపించింది. కథకు ఓకే చెప్పిన తర్వాత ఆడిషన్స్‌ తీసుకున్నారు. ఆడిషన్స్‌ అయిన తర్వాత రెండు నెలల వరకు దర్శకుడి నుండి ఎలాంటి సమాచారం అందలేదు. దాంతో కాస్త టెన్షన్‌ పడ్డాను. కొన్ని రోజుల తర్వాత సినిమా ఓకే అయినట్లుగా కన్ఫర్మ్‌ అయ్యింది. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.

పీరియాడిక్‌ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఎక్కువగా ఇలాంటి పీరియాడిక్‌ సినిమాలు చేశారు. నా ఫేవరేట్‌ డైరెక్టర్‌ స్టైల్‌ మూవీతో నేను పరిచయం కాబోతుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రేమ కథలు ఎప్పటికి పాతవి కావు. ఎప్పుడు చూసినా కూడా ప్రేమ కథల్లో కొత్తదనం ఉంటుంది. ప్రేమ కథలు ఎప్పటికి బోర్‌ కొట్టవు. అందుకే నేను ఈ ప్రేమ కథను ఎంపిక చేసుకున్నాను. దర్శకుడు ఈ చిత్రంలో చూపించిన ప్రేమ కథ చాలా విభిన్నంగా ఉంటుంది. దర్శకుడు నటీనటుల కోసం సీన్స్‌ రాసుకోకుండా కథలో భాగంగా సీన్స్‌ రాసుకుని దాన్నే చేయడం జరిగింది. దర్శకుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌ తో నేను చక్కగా నటించాను.

'దొరసాని' చిత్రంలోని నా పాత్ర 80లలో అమ్మాయిగా ఉండాలి. అప్పటి పరిస్థితులు, కట్టు బొట్టు విషయాలు నాకు తెలియదు. అందుకే అమ్మ అప్పట్లో నటించిన తలంబ్రాలు సినిమా చూశాను. ఆ సినిమా నుండి చాలా తీసుకున్నారు. షూటింగ్‌ మొదట్లో ఎక్కువ శాతం మంది జీవిత గారిలా ఉన్నారంటే చాలా సంతోషంగా అనిపించేది. అమ్మ నాకు ఎప్పుడు ఇన్సిపిరేషన్‌. ఆమె ఏ పాత్ర చేసినా కూడా ఇన్వాల్వ్‌ అయ్యి చేయమని సలహా ఇచ్చేవారు. ఇక నాన్న ఇమేజ్‌ నాకు ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. ఆయన ఇమేజ్‌ తో నా సినిమాలపై ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాన్న ఇమేజ్‌ వల్ల ఇబ్బంది కంటే సంతోషం నాకు ఎక్కువ. నాన్న ఎప్పుడు కూడా దర్శకుడి హీరోగా సినిమాలు చేశారు. డైరెక్టర్స్‌ హీరోగా నాన్న పేరు తెచ్చుకున్నారు. అలాగే నేను కూడా డైరెక్టర్స్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. నాన్న ఫాలో అయిన మార్గంలోనే నేను కూడా వెళ్తానంది.

మధుర ఎంటర్‌ టైన్మెంట్స్‌ నిర్మించిన 'దొరసాని' చిత్రం ఈనెల 12వ తారీకున రిలీజ్‌ కు సిద్దం అయ్యింది. ఈ చిత్రంతో హీరోగా ఆనంద్‌ దేవరకొండ పరిచయం కాబోతున్నాడు. ఆనంద్‌ మరియు శివాత్మిక కు ఈ చిత్రం చాలా కీలకం.