Begin typing your search above and press return to search.

`దొర‌సాని` ప్రేమ‌లో దేవ‌ర‌కొండ బ్ర‌ద‌ర్‌

By:  Tupaki Desk   |   25 July 2018 11:23 AM GMT
`దొర‌సాని` ప్రేమ‌లో దేవ‌ర‌కొండ బ్ర‌ద‌ర్‌
X
`పెళ్లిచూపులు` త‌ర‌హాలో సురేష్ బాబు.. మధుర శ్రీధ‌ర్ అండ్ కో ఓ కొత్త ప్ర‌య‌త్నానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. కెవీఆర్ మ‌హేంద్ర అనే యువ ద‌ర్శ‌కుడు చెప్పిన ఓ క‌థ‌కి ఈ బృందం గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఆ చిత్రాన్ని `దొర‌సాని` పేరుతో రూపొందించ‌నున్న‌ట్టు కూడా ఇదివ‌ర‌కే సురేష్‌ బాబు వెల్ల‌డించారు. కొత్త న‌టుల‌తోనే ఈ సినిమాని తీయాల‌ని ఫిక్స‌యిన చిత్ర‌బృందం ఆ మేర‌కు ప‌లువురిని ప‌రిశీలించి... చివ‌రికి విజ‌య్ దేవ‌ర‌కొండ బ్ర‌ద‌ర్ ఆనంద్‌ ని ఓకే చేసిన‌ట్టు స‌మాచారం. దొర‌సాని ప్రేమ‌లో ప‌డే కుర్రాడి క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని - ఆ పాత్ర‌కి ఆనంద్ ప‌ర్‌ ఫెక్ట్‌ గా స‌రిపోతాడ‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ఇందులో హీరోయిన్ గురించి కూడా ప్ర‌చారం మొద‌లైంది. జీవిత రాజ‌శేఖ‌ర్‌ ల చిన్న కూతురు ఇందులో హీరోయిన్‌ గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ జ‌నాలు చెప్పుకుంటున్నారు. మ‌రి అందులో నిజమెంత‌న్న‌ది తెలియాలంటే చిత్ర‌బృందమే స్పందించాలి. విజ‌య్ దేవ‌ర‌కొండ బ్ర‌ద‌ర్ ఆనంద్ మాత్రం ఇందులో ప‌క్కాగా న‌టిస్తున్నాడ‌ని తెలిసింది. మ‌రి అన్న‌లాగే త‌మ్ముడు కూడా మంచి క‌థానాయ‌కుడిగా ఎదుగుతాడేమో చూడాలి.