Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: జీవిత- 2ని త‌ల‌పిస్తూ..

By:  Tupaki Desk   |   26 July 2018 9:41 AM GMT
ఫోటో స్టోరీ: జీవిత- 2ని త‌ల‌పిస్తూ..
X
అవును.. ఓవైపు అక్క శివాని అదృష్టం ప‌రీక్షించుకుంటోంది. టాలీవుడ్‌ - కోలీవుడ్‌ లో డెబ్యూ సినిమాల‌తో దుమ్ము దులిపేసేందుకు రెడీ అవుతోంది. తెలుగులో అడ‌వి శేష్ స‌ర‌స‌న `2 స్టేట్స్` లాంటి క్రేజీ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా తొంద‌ర్లోనే రిలీజ్‌ కి రెడీ అవుతోంది. ఇంకా అక్క తొలి సినిమా రిలీజ్ కానేలేదు. ఈలోగానే చెల్లాయ్‌ శివాత్మిక శివాలెత్తిపోతోంది. అక్క‌కు ధీటుగా బ‌రిలోకి దిగిపోతోంది. డెబ్యూ ముందు శివాత్మిక ఫోటోషూట్లతో దుమ్ము దులిపేసింది.

ఇప్పుడు శివాత్మిక కూడా అక్క శివానీ బాట‌ను అనుస‌రిస్తోంది. తాజాగా రివీలైన‌ శివాత్మిక లేటెస్ట్ ఫోటోషూట్ అద‌ర‌గొడుతోంది. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ఈ ఫోటోలు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. శివాత్మిక అచ్చం మ‌మ్మీ జీవిత‌నే ప్ర‌తిబింబిస్తోంది. ట్రెడిష‌న‌ల్ లుక్‌ - అల్ట్రా మోడ్ర‌న్ టైట్‌ ఫిట్‌ లో శివానీ ఫోటోలు శివాలెత్తించాయంటే అతిశ‌యోక్తి కాదు. జీవిత‌లోని న‌ట‌ప్ర‌తిభ‌ను, డాడ్ రాజ‌శేఖ‌ర్‌ లోని యాంగ్రీనెస్‌ ని క‌ల‌బోసుకున్న శివాత్మిక పెద్ద స్టార్ అవుతుంద‌నే అంచ‌నా వేస్తున్నారంతా. ఆల్ ది బెస్ట్ టు యంగ్ హీరోయిన్‌.