Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: యాంగ్రీ స్టార్ డాటర్స్.. చాలా కూల్!

By:  Tupaki Desk   |   28 Dec 2019 2:46 PM GMT
ఫోటో స్టోరీ: యాంగ్రీ స్టార్ డాటర్స్.. చాలా కూల్!
X
న్యూ ఇయర్ జోష్ అప్పుడే వచ్చేసింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు న్యూ ఇయర్ వెకేషన్ కోసం అందమైన ప్రదేశాలకు వెళ్ళారు. ఇంకొందరేమో ఇప్పుడిప్పుడే న్యూ ఇయర్ వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తెలు ఇద్దరూ కూడా ఈ జెనరేషన్ స్టార్ కిడ్స్ లాగానే న్యూ ఇయర్ వేడుకలలో మునిగిపోయారు.

శివాని.. శివాత్మిక ఇద్దరూ తమ కజిన్స్.. ఫ్రెండ్స్ తో కలిసి సింగపూర్ ట్రిప్ వేసుకున్నారు. అక్కడ షాపింగ్ చేస్తూ.. హోటల్స్ లో విభిన్న వంటకాలు రుచి చూస్తూ.. నగరంలో చక్కర్లు సరదాగా గడుపుతూ ఉన్నారు. ఇలాంటి విశేషాలు ఉన్నప్పుడు అభిమానులతో పంచుకోవడం చాలా కామన్ కదా. అలానే శివాత్మిక తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. సింగపూర్ లోని మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పైన ఉన్న రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన దక్కుతోంది.

రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని '2 స్టేట్స్' సినిమాతో హీరోయిన్ గా పరిచయం కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. శివాని కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే శివాత్మిక 'దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. సినిమా విజయం సాధించలేదు కానీ శివత్మిక నటనకు.. ఎనర్జీకి ప్రేక్షకులనుండి ప్రశంసలు లభించాయి.