Begin typing your search above and press return to search.

మరో ప్రేమకథ రాస్తున్న టక్ శివ.. మరి VD ప్రాజెక్ట్ సంగతేంటి..?

By:  Tupaki Desk   |   25 Sep 2021 10:41 AM GMT
మరో ప్రేమకథ రాస్తున్న టక్ శివ.. మరి VD ప్రాజెక్ట్ సంగతేంటి..?
X
'నిన్ను కోరి' వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ.. వెంటనే 'మజిలీ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన 'టక్ జగదీష్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఓటీటీ రిలీజ్ కాబట్టి నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉండటమే కాకుండా.. ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అయింది.

మొదటి రెండు చిత్రాలను ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ గా రూపొందించిన శివ నిర్వాణ.. మూడో చిత్రాన్ని కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు నాల్గవ సినిమా కోసం తనకు కలిసొచ్చిన ప్రేమకథనే రెడీ చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. శనివారం ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేసిన శివ.. తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్ బీచ్ లో కొత్త కథని రాయడం మొదలుపెట్టినట్లు వెల్లడించారు.

ప్రేక్షకుల మనసులకు బాగా దగ్గరైన 'నిన్ను కోరి', 'మజిలీ' తరహాలో మరో ప్రేమకథను రాస్తున్నానని.. చాలా ఎగ్జైటింగ్ గా హ్యాపీగా ఉందని శివ నిర్వాణ అన్నారు. సముద్రం - కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో.. ఈ కథ కూడా అంత ఒరిజినల్ గా ఉంటుందని తెలిపారు. దీనితో శివ నిర్వాణ నుంచి మరో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ వస్తుందనేది అర్థం అయింది.

అయితే ఈ సందర్భంగా శివ నిర్వాణ #SN4 అని హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో తదుపరి ప్రాజెక్ట్ విషయంలో కన్ఫ్యూజన్ మొదలైంది. తన నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండ తో ఉంటుందని.. అది కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అని నిర్వాణ 'టక్ జగదీష్' ప్రమోషన్స్ లో తెలిపారు. కానీ ఇప్పుడు కొత్తగా మరో ప్రేమకథ రాస్తున్నా అని చెప్పడం.. అది తన 4వ సినిమా అని పేర్కొనడంతో విజయ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

'టక్' రిజల్ట్ చూసి శివ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ని విజయ్ దేవరకొండ హోల్డ్ లో పెట్టారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాదు నాగచైతన్య తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శివ నిర్వాణ వైజాగ్ బీచ్ లో రాస్తున్న స్టోరీ చైతన్య కోసమే అయ్యుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'మజిలీ' తర్వాత ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి జత కడతారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.