Begin typing your search above and press return to search.

వీడియో : థైస్ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ వీధిలో క్యాట్‌ వాక్

By:  Tupaki Desk   |   5 May 2022 1:12 PM GMT
వీడియో : థైస్ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ వీధిలో క్యాట్‌ వాక్
X
సీనియర్‌ హీరో రాజశేఖర్‌ దంపతుల ముద్దుల కూతుర్లు శివాని మరియు శివాత్మక లు హీరోయిన్స్‌ గా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు కూడా టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో మంచి సినిమాలు చేయాలని ఆశ పడుతున్నారు. కమర్షియల్‌ పాత్రలతో పాటు మంచి పద్దతైన పాత్రలను చేయాలని వీరు ఉబలాట పడుతున్నారు. అందం విషయంలో ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా ఉండే ఈ ఇద్దరు అమ్మాయిలు ఎక్స్‌ పోజింగ్‌ విషయంలో ఈ మద్య ముంబై ముద్దుగుమ్మలను కూడా బీట్ చేస్తున్నారు.

హీరోయిన్‌ లుగా వరుసగా సినిమాలు చేస్తున్న శివాని మరియు శివాత్మిక లు రెగ్యులర్ గా హాట్‌ ఫోటోలు మరియు రెగ్యులర్‌ పోటోలను షేర్‌ చేస్తూ ఉన్నారు. ఆ ఫోటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా శివాని తన వీడియో ను షేర్‌ చేసింది. ఆ వీడియో లో వీధి లో క్యాట్ వాక్ చేస్తూ ఉంది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ మోడల్ గా ర్యాంప్ వాక్‌ చేసి అందరిని ఆకట్టుకుంది. మోడల్ గా ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు దక్కించుకున్న శివాని చేసిన క్యాట్‌ వాక్ కు అంతా కూడా వావ్‌ అంటున్నారు.

అందాల పోటీల్లో పాల్గొంటున్న శివాని త్వరలో తండ్రి రాజశేఖర్‌ తో కలిసి శేఖర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తండ్రితో కలిసి నటించాలనే కోరిక ఈ సినిమా తో తీరినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఇటీవలే శివాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక శేఖర్‌ సినిమాలో ఆమె పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంటుందని ట్రైలర్ విడుదల తర్వాత క్లారిటీ ఇచ్చారు.

తండ్రి రాజశేఖర్‌ తో కలిసి నటించిన సన్నివేశాలు మరియు సినిమాలోని ఆమె పాత్ర తప్పకుండా ఆకట్టుకుంటుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇక మోడల్‌ గా ఈమె మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. శేఖర్‌ సినిమా సక్సెస్‌ అయితే తప్పకుండా శివాని మరిన్ని అవకాశాలను దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.