Begin typing your search above and press return to search.

మళ్లీ ఓటీటీ ద్వారా రాబోతున్న శివాని రాజశేఖర్‌

By:  Tupaki Desk   |   4 Dec 2021 1:08 PM GMT
మళ్లీ ఓటీటీ ద్వారా రాబోతున్న శివాని రాజశేఖర్‌
X
జీవిత రాజశేఖర్ ల ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదట శివాత్మిక దొరసాని సినిమాతో పరిచయం అయ్యింది. అంతకు ముందే శివాని హీరోయిన్ గా పరిచయం అవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నిలిచి పోయింది. పెద్దమ్మాయి శివాని మొదటి సినిమా అద్బుతం అంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు చిరంజీవి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరో సినిమాతో శివాని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివాని హీరోయిన్ గా రూపొందిన డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల అవ్వబోతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు థియేటర్ల ద్వారా రిలీజ్ అవ్వడం సేఫ్‌ కాదు. ఎందుకంటే సమ్మర్ వరకు వరుసగా పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. కనుక శివాని కొత్త సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా ను సోని లివ్‌ వారు ఫ్యాన్సీ రేటుకు స్ట్రీమింగ్‌ హక్కులు కొనుగోలు చేయడం జరిగిందట. వారు ఈ సినిమా తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్ మెంట్‌ అందించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే సోని లివ్‌ లో వరుసగా తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఈ సినిమా లో శివాని మరియు అదిత్ అరుణ్‌ లు నటించారు. కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె వి గుహన్ అందించారు. ఈ సినిమా సోని లివ్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల మాట్లాడుతూ.. మా ఫ‌స్ట్ మూవీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్‌ మూవీ ఇది. ఓటీటీకి ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్‌. సోనివంటి ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌తో అసోసియేట్ అవ‌డం చాలా హ్యాపీ. ఈ సినిమా సోనిలివ్ ద్వారా మ‌రింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహ‌న్‌గారి మేకింగ్, అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వ‌ర్గాల‌వారిని ఆక‌ట్టుకుంటుంది అన్నారు.