Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 3 : శివజ్యోతి కూడా అదే ప్రయత్నిస్తోందా?

By:  Tupaki Desk   |   31 July 2019 12:55 PM GMT
బిగ్‌ బాస్‌ 3 : శివజ్యోతి కూడా అదే ప్రయత్నిస్తోందా?
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 మొదటి వారం రసవత్తరంగా సాగింది. అయితే రెండవ వారం మొదటి రెండు రోజులు కూడా సో సోగానే సాగింది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్‌ లో పెద్దగా స్టఫ్‌ ఏమీ కనిపించలేదు. పునర్ణవికి వరుణ్‌ సపోర్ట్‌ చేయడం అందుకు వితిక బాధ పడటం తప్పితే నిన్నటి ఎపిసోడ్‌ లో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఇన్ని రోజుల నుండి పెద్దగా కంటెంట్‌ ఇవ్వని శివ జ్యోతి కూడా ఇప్పుడు స్క్రీన్‌ స్పేస్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా నిన్నటి ఎపిసోడ్‌ ద్వారా తెలుస్తోంది.

ఇంటి కనీస అవసరాలు తీరాలంటే సైకిల్స్‌ తొక్కాలంటూ బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఆదేశాలతో ఇంటి సభ్యులు నేనంటే నేను అంటూ సైకిల్‌ తొక్కేందుకు ముందుకు వచ్చారు. శివజ్యోతి కూడా తాను సైకిల్‌ తొక్కే అవకాశం రావడం లేదు అంటూ ఇంటి సభ్యుల వద్ద మొర పెట్టుకుంది. గ్రూప్‌ లుగా ఏర్పడి ఈ టాస్క్‌ ను చేస్తే బాగుంటుందని శివ జ్యోతి చెప్పే ప్రయత్నం చేసింది. కాని అందుకు ఎవరు ఒప్పుకోలేదు. గ్రూప్‌ వద్దని అన్నారు. శ్రీముఖి తొక్కుతున్న సైకిల్‌ ను తీసుకుని ఈమె తొక్కింది. టాస్క్‌ లో పార్టిసిపెట్‌ చేసేందుకు ఆమె చూపించిన చొరవ ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్‌ ను ఎంతగా కోరుకుంటుందో చెప్పకనే చెప్పింది.

ఈ వారం శివజ్యోతి నామినేషన్‌ లో లేకపోయినా కూడా ఆమె ప్రేక్షకుల అటెన్షన్‌ ను కోరుకుంటుందనిపిస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా మంచి వాళ్లం అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే శివ జ్యోతి ఈరకంగా ప్రేక్షకుల దృష్టిలో పడి వావ్‌ అనిపించుకోవాలని ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎవరు తగ్గకుండా ఎవరికి వారు అన్నట్లుగా మస్త్‌ మస్త్‌ గా గేమ్‌ ఆడుతున్నారు. నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో శివ జ్యోతి కన్నీరు కూడా పెట్టుకోబోతుంది. వరుణ్‌ తో ఏదో గొడవ కారణంగా జ్యోతి కన్నీరు పెట్టుకున్నట్లుగా ప్రోమోలో చూపిస్తున్నారు.