Begin typing your search above and press return to search.

బాలయ్య అభిమానులకు ఆ వీడియో చాలు

By:  Tupaki Desk   |   26 Dec 2017 12:30 PM GMT
బాలయ్య అభిమానులకు ఆ వీడియో చాలు
X
సాధారణంగా సోషల్ మీడియాలు అనేవి రోజూ కలవని ఎంతోమందిని కలపడానికి ఉపయోగపడతాయి.. లేదంటే కొత్తవారితో నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయ్ అని అందరూ అనుకుంటారు. కాని మనోళ్ళు మాత్రం.. అభిమానుల పేరుతో కొట్టుకోవడానికి ఫేస్ బుక్ ట్విట్టర్ తదితర మాద్యమాలను భలే వాడుతుంటారులే. అందుకే అక్కడ మనం అన్ని రకాల వీడియోలనూ తెగ చూస్తుంటాం.

ఇకపోతే నందమూరి బాలకృష్ణ కు సంబంధించి ఏదన్నా వీడియో ఉందంటే.. ముందుగా అందులో ఆయన తన అభిమానులను కొడుతున్న కాంట్రోవర్శీ వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తాయ్. అయితే ఇప్పుడు మాత్రం.. నందమూరి ఫ్యాన్స్ అందరూ ఒక వీడియోను తెగ వైరల్ చేస్తన్నారు. అదేంటంటే.. జైసింహ ఆడియో లాంచ్ లో.. మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన నటుడు.. మా ప్రెసిడెంట్ శివాజి రాజా మాట్లాడుతూ.. ''బాలయ్య బాబుతో నా స్నేహం 32 ఏళ్ళు. బాలయ్యతో ఎన్నో సింహా సినిమాల్లో నేనున్నాను. ఒక చిన్న నటుడు వచ్చి క్యాన్సర్ ఉంది సాయం చేయండి అని అడిగితే ముందు గుర్తొచ్చింది బాలయ్యే. ఆయన రాత్రి 9.30 ని.లకు నిద్రపోతారని తెలిసినా.. ఒకసారి ఆయనకు 10.30కి ఫోన్ చేస్తే మాత్రం.. వెంటనే నేనొస్తున్నా అంటూ బయలుదేరి వచ్చారు. అది చాలా గొప్ప విషయం. క్యాన్సర్ నుండి కోలుకున్న ఆ నటుడు.. తన ఆయుష్సు తన పిల్లల ఆయుష్సు కూడా పంచుకుని బాలయ్య ఎక్కువకాలం బతకాలని కోరుకున్నాడు'' అంటూ చెప్పారు.

ఇప్పడు ఈ వీడియో ఎక్కడ చూసినా కూడా ఫేస్ బుక్ అండ్ ట్విట్టర్లలో తెగ చెక్కర్లు కొడుతోంది. బాలయ్య గొప్పదనం చూడండి అంటూ తెగ సందడి చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే ఇలాంటి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం ఇష్టపడని బాలయ్య.. శివాజి ఈ విషయం చెబుతున్నప్పుడు కాస్త ఇబ్బందిపడుతున్నట్లు కనిపంచారు. అది సంగతి.